Breaking News

ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఇచ్చిన ప్రతి మాటను నెరవరుస్తున్న నాయకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం 11వ డివిజన్,రెల్లీస్ కాలనీ లో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్ లో గడపగడపకు తిరిగినప్పుడు కాలనీ వాసులు నా దృష్టికి పార్క్ అభివృద్ధి గురుంచి, ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయించాలని అడిగారు. ప్రజల 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక నెరవేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం అందరికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇచ్చాను కాబట్టే దమ్ముగా ధైర్యంగా నాకు ఓటు వెయ్యమని అడుగుతున్నాను. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లాగా ఎన్నికల ముందు ఓట్లు కోసం దొంగ హామీలు ఇచ్చి మోసం చేయడం నాకు చేతకాదు. ప్రజలను మరలా మోసం చేయడానికి దొంగ హామీలతో పార్టీలు అన్ని మళ్ళీ ఏకం అయ్యాయి. ఒక్కసారి 2014 లో ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చరో ప్రజలు గుర్తు తెచ్చుకోండి. వారు అధికారంలోకి వస్తే మనకు మంచి చేస్తున్న వలంటీర్ వ్యవస్థ, సచివాలయలను రద్దు చేసి మరలా జన్మభూమి కమిటీలు తీసుకొస్తారు. ఈ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ, కలెక్టర్ ఆఫీసు ల చుట్టూ ఎన్నోసార్లు తిరిగితే గాని పని అవ్వలేదు. ఈ రిజిస్ట్రేషన్ తో ప్రజలకు ఆస్తి మీద సంపూర్ణ హక్కులు వచ్చాయి..మీ ఆస్తి పెరిగింది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అండగా నిలవాలని అవినాష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు అన్నే గోపాల కృష్ణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్, మండల అధ్యక్షులు రిజ్వాన్, వైసీపీ నాయకులు ఉదయ్, దుర్గాప్రసాద్, చందు, చోటు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *