గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శనివారం తూర్పు నియోజకవర్గానికి సంబందించి ఆన్ లైన్ ద్వారా ఎన్నికలకు సంబందించి అందిన ఫిర్యాదులపై నిర్దేశిత సమయంలోపు స్పందించడంలో జాప్యంపై ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం కు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్, రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ2024 సాదారణ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిస్టంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు ఫ్లైయింగ్ స్క్వాడ్ లను నియమించామని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా 3 బృందాలను ఏర్పాటు చేశామని, అందులో షిఫ్ట్ 2 బృందం ఆన్ లైన్ ద్వారా అందిన ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కారం చేయడంలో జాప్యం చేశారన్నారు. కేటాయించిన ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంపై బృందంలోని పి.ఉమాదేవి, ఎం.ప్రమీల, కె.మహేష్, ఎస్.శ్రీనివాసరావు, వి.ఇందిరలకు 24 గంటల్లో వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఏ విధమైన నిర్లక్ష్యాన్ని సహించబోమని, విధుల్లో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, అంకితభావంతో ఉండాలన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …