Breaking News

భ‌వ‌న నిర్మాణ‌, ట్రాన్స్ ఫోర్ట్ రంగ కార్మికుల అభివృద్ధే నా ల‌క్ష్యం : కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని ర‌ద్దు చేసి భ‌వ‌న‌నిర్మాణ రంగ కార్మికుల‌కి తీవ్ర అన్యాయం చేశాడు. ఆ త‌ర్వాత మూడు రాజ‌ధానుల అంటూ అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం అట‌కెక్కించ‌టంతో విజ‌య‌వాడ‌లోని ఆటో కార్మికులు ఆటోల‌కి అద్దె చెల్లించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. జ‌గ‌న్ ఆటోమొబైల్, ట్రాన్స్ పోర్ట్, భ‌వ‌న‌నిర్మాణ రంగాల‌ను నాశ‌నం చేశాడు. టిడిపి అధికారంలోకి రాగానే ఈ రంగాల‌ను అభివృద్ధి పథం వైపు న‌డిపిస్తాన‌ని టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తెలియ‌జేశారు.

ఆదివారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్య‌క్షుడు గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు  నాయ‌క‌త్వంలో వివిధ పార్టీల‌కు చెందిన నూట యాభై మందికి పైగా భ‌వ‌న‌నిర్మాణ, ఆటో సంఘ నాయ‌కులు, కార్మికులు కేశినేని శివ‌నాథ్ , తూర్పు నియోజ‌క‌వ‌ర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి గ‌ద్దె రామ్మెహ‌న్ రావు  స‌మ‌క్షంలో టిడిపి కండువా క‌ప్పుకున్నారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ మ‌ల్లిబాబు ఆధ్వ‌ర్యంలో వైసిసికి చెందిన‌ వంద‌మంది చేర‌గా, ఏఐటియుసి భ‌వ‌న నిర్మాణ విభాగ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ ఉమ‌ర్ వ‌లీ ఆధ్వ‌ర్యంలో 50 మంది చేరారు. టిడిపి తీర్దం పుచ్చుకున్న వారిలో సాయి కిషోర్, న‌జీర్, రుషి, రాజేష్‌, గుందా వెంక‌టేశ్వ‌ర‌రావు, ఇస్మాయిల్ ,వీర‌బాబు, కుమార్, శేఖ‌ర్, రాజు, సూరి,ప‌సుపులేటి రాంబాబు, త‌మ్మిశెట్టి నాగ‌రాజు త‌దిత‌రులు వున్నారు. వీరంద‌రికి కేశినేని శివ‌నాథ్ , రామ్మెహ‌న్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ కొంత‌మంది అనుకునే విధంగా టిడిపి క్యాపిట‌లిస్టుల పార్టీ కాద‌ని కార్మికుల పార్టీ..చంద్ర‌బాబు నాయుడు కార్మికుల ప‌క్ష‌పాతి అన్నారు. 2014-19 కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రంలో భ‌వ‌న‌నిర్మాణ కార్మికులకి, ఆటో కార్మికులకి ఉపాధి బాగా దొరికింది. పెద్ద పెద్ద సంస్థ‌లు ఇక్క‌డికి రావ‌టం జ‌రిగింది. జ‌గ‌న్ పాల‌న‌లో ఏ సంస్థ ఎపికి రాలేదు. చంద్ర‌బాబు విజ‌న్ కార్మికుల సంక్షేమం..ఆయ‌న ఏప‌ని చేసినా ఎవ‌రి కాళ్ల మీద వారు నిల‌బ‌డే విధంగా ఆలోచిస్తారు. అమ‌రావ‌తి లో రాజ‌ధాని నిర్మాణం కొన‌సాగి వుంటే భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల జీవితాల‌తోపాటు ఆటో కార్మికుల జీవితాలు ఎంతో మెరుగుప‌డేవి. నాకు ఈ ట్రాన్స్ పోర్ట్, భ‌వ‌న‌నిర్మాణ రంగాల‌తో సంబంధం వుంది. విజ‌య‌వాడ న‌గర అభివృద్ది ఈ రెండు రంగాల అభివృద్ది పైనే ఆధార‌ప‌డి వుంది. ఈ రెండు రంగాల‌ను అభివృద్ది చేయ‌ట‌మే నా ముందు వున్న ల‌క్ష్యం. ఆటోన‌గ‌ర్ లో దాదాపు 70వేల మంది ఆటోమొబైల్ కార్మికులు ప‌నిచేస్తున్నారు.వారితో పాటు భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల‌కి సిల్క్ డెవ‌ల‌ప్ సెంట‌ర్స్ ఏర్పాటు చేసి…వారంద‌ర్నీ అప్ గ్రేడ్ చేస్తాము. ఏ రంగానికి చెందిన కార్మికులైనా స‌రే యూనియ‌న్ గా ఏర్ప‌డితే…వారంద‌రికీ సిల్క్ డెవ‌ల‌ప్ సెంట‌ర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తాము.

ప్రస్తుతం టిడిపి అనుబంధ సంఘాల ఆధ్వ‌ర్యంలో న‌డుస్తుంది. గ‌తంలో కంటే టి.ఎన్.టి.యు.సి ఇప్పుడు బాగా ప‌నిచేస్తుంది. ర‌ఘురామ‌రాజు చురుగ్గా కార్మికుల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్నాడు. రాబోయే టిడిపి ప్ర‌భుత్వం పాత‌, కొత్త నాయ‌కుల క‌ల‌యిక గా వుండ‌బోతుంది. కాబట్టి మ‌నం కూడా అంద‌ర్నీ క‌లుపుకుపోవాలి. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు  ముఖ్య‌మంత్రి గా రావాలి. అలాగే తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని యువ‌త గంజాయికి బానిస కాకుండా వుండాలంటే గ‌ద్దె రామ్మెహ‌న్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి. అవినాష్ అసాఘింక శ‌క్తుల‌కి అండ‌గా వుంటున్నాడు. జ‌గ‌న్ ఆలోచ‌న విధానాలను న‌చ్చ‌క‌…రాష్ట్రాబివృద్ది కోసం బొప్పున భ‌వ‌కుమార్ ఎలాంటి ప‌దువులు ఆశించ‌కుండా టిడిపిలో చేరారు. గ‌తంలో ఈ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ద్దె, భ‌వ‌కుమార్ ఎమ్మెల్యే అభ్య‌ర్ధులుగా పోటీప‌డ్డారు. ఆ ఎన్నిక‌లు ఎంతో స‌జావుగా, శాంతియుతంగా జ‌రిగాయి..అవినాష్ అలాంటి వాతావ‌ర‌ణం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో లేకుండా చేస్తున్నాడని శివ‌నాథ్ చెప్పారు.

అనంత‌రం గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ చంద్ర‌బాబు హ‌యంలో ఆటో కార్మికులు ఖాళీ లేకుండా మూడు షిఫ్ట్స్ లో ప‌నిచేసేవారు.రోజుకి 1500 రూపాయ‌ల సంపాదించేవారు. అలాగే భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల‌కి ప్ర‌తిరోజు ప‌ని వుండేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితులు లేవు. ఈ రెండు రంగాల్లోని కార్మికులు 1200 నుంచి 1500 రూపాయ‌లు సంపాదించే స్థితి నుంచి రెండు మూడొంద‌లు సంపాదించే ప‌రిస్థితికి దిగిపోయారు. వీరంద‌రికి పూర్వ వైభ‌వం రావాలంటే విజ‌య‌వాడ లో రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గాలి. అలా జ‌ర‌గాలంటే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావాలి. అప్పుడు చంద్ర‌బాబు న‌వ‌నిర్మాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తారు అని గ‌ద్దె రామ్మెహ‌న్ చెప్పారు.

ఇక టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్య‌క్షుడు గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు మాట్లాడుతూ కార్మికుల‌కి నిత్యం అండ దండ‌గా వుండే గ‌ద్దె రామ్మోహ‌న్ ని .. కేశినేని శివ‌నాథ్ ని చేరో 50 వేల మెజార్టీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ప‌రుచూరి ప్ర‌సాద్, నూతక్కి రాము, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు మోక‌ర ఆదిబాబు, శ్యాము, కోశాధికారి సూర్య‌ప్ర‌కాష్, నియోజ‌క‌వ‌ర్గాల అధ్య‌క్షులు అశోక్ , గ‌రిమెళ్ల చిన్నా, హ‌నుమంతురావు ,ముఠా యూనియన్ రాష్ట్ర నాయ‌కులు లింగం ప‌ల్లి మోహ‌న్ రావు నాయ‌కులు శేషు బాబు , చంటిల‌తోపాటు తూర్పు నియోజ‌క‌వ‌ర్గ టిడిపి, జ‌న‌సేన‌, బిజెపి నాయ‌కులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *