-సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకు బేరింగ్ లను మార్చడం జరుగుతుంది
-క్షేత్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులతో గామాన్ వంతెన పరిశీలన
-సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రాఫిక్ మళ్లింపు పై అధికారులకి దిశా నిర్దేశనం
-హాజరైనా ఆర్ అండ్ బి, పోలీస్, రెవెన్యూ అధికారులు
-ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న
రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గమన్ బ్రిడ్జి పై మరమ్మత్తులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాలు ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , ఎస్పి పి. జగదీష్, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ మరియు రాష్ట్రా రహదారులు అభివృద్ది కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్. శ్రీనివాస రెడ్డి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఈ ఈ – ఏ. శ్రీకాంత్, ఆర్ అండ్ బీ ఈ ఈ ఎస్బివి రెడ్డి, డి ఈ బివివి మధుసూధన్ రావు, డిఎస్పీ కే సి హెచ్ రామా రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ , గామన్ బ్రిడ్జి కి చెందిన సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహణ సంస్థ 56 – 57 మధ్య స్పాన్ వద్ద సాంకేతిక పరమైన లోపం గుర్తించడం జరిగిందన్నారు. వాహనాలు వెళుతున్న క్రమంలో వైబ్రేషన్స్ అధిక స్థాయి లో ఉన్నట్లు తెలిపారు. ఆ నేపధ్యంలో తక్షణ మరమ్మత్తులకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలియ చేశారు. కేవలం బెరింగ్ లు మాత్రమే దెబ్బ తినడం జరిగిందనీ, వంతెన భద్రత కు ఎటువంటి ఇబ్బందీ లేదనీ స్పష్టం చేశారు. బేరింగ్ అందుబాటులో ఉంటే నాలుగైదు రోజుల్లో పనులు చేపట్టడం జరుగుతుందనీ అన్నారు. ఒక వేళ అందుబాటులో లేని ఎడల ఈ వంతెన కు అనుగుణంగా బే రింగ్ తయారు చెయ్యాల్సి ఉంటుందనీ, అవి కలకత్తా లో వాటి తయారు చేసే కంపెనీలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించడం, ఆమేరకు ఇంజనీరింగ్ అధికారుల సూచనల మేరకు తదుపరి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ట్రాఫిక్ సమస్య ఉత్పనం కాకుండా ఒక వైపు నుంచే రాను పోను వాహనాలను అనుమతించ నున్నట్లు తెలియ చేశారు. సాధ్యమైనంత తొందరగా మరమ్మత్తులు పూర్తి చేసి యధావిధిగా ట్రాఫిక్ రెండూ వైపులా అనుమతించనున్నట్లు మాధవీ లత పేర్కొన్నారు. వాహనదారులు అధికారులకి, పోలీసులకు సహకారం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ పర్యటన లో జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పి పి. జగదీష్ , ఆర్డీసి ఎండి ఎల్. శ్రీనివాస రెడ్డి తదితరులు గామాన్ బ్రిడ్జి పై చెయ్యవలసిన పనులు ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందని అన్నారు. తదుపరి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు పై పోలీసు, రహదారుల, టోల్ గేట్ అధికారులతో సమీక్షించారు.