విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)ల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థాన్నాల్లో సీపీఐని బలపర్చటానికి కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందన్నారు. ఇటీవల హైదరాబాద్ నందు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా నివాసంలో ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర పార్టీ ప్రతినిధి కె.రాజు పాల్గొనగా సీపీఐ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో గురువారం జరిగిన చర్చల్లో ఏ ఏ స్థానాల్లో సీపీఐని కాంగ్రెస్ బలపర్చుందనే అంశాన్ని ప్రకటించటం జరిగిందన్నారు. సీపీఐ పోటీ చేసే స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు విశాఖపట్నం పశ్చిమ, ఏలూరు, విజయవాడ పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, కమలాపురం నియోజకవర్గాలు ఉన్నాయని వివరించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …