విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 12న ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4తో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది. అనంతరం పునఃపరిశీలన, మార్కుల నమోదు పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఏపీ 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఈనెల 8వ తేదీతో ముగియనుంది. అనంతరం వారం, పది రోజుల్లో ఏపీ 10వ తరగతి ఫలితాలు సైతం విడుదలయ్యే అవకాశం ఉంది.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News