-నమూనా నామినేషన్ల ఫారం సెట్ అందజేయడం జరిగింది
-ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్
కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త :
నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వాటినీ అత్యంత జగ్రత్తగా భర్తీ చేసి సమర్పించాలని, అందుకు అనుగుణంగా నమూనా ఫారం లని అందజేయడం జరిగిందని కొవ్వూరు (ఎస్సి) రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్
తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ, గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందనీ, అంతకు ముందు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. గురువారం ఏప్రియల్ 18 నుంచి ఏప్రియల్ 25 వరకు ( ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11. గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రతిరోజూ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలియ చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద 100 మీటర్లు వరకూ 144 సెక్షన్ అమలు లో ఉంటుందనీ తెలియ చేశారు. అక్కడి వరకూ మూడు వాహనాలను అనుమతించడం జరుగుతుందనీ అన్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో పరిమితి కి లోబడి 1+4 వరకూ మాత్రమే అనుమతిస్తామన్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఫారం 2 బీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.
నమూనా ఫారం
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, పోటిలో నిలబడే అభ్యర్ధులు సహకరించాలని సబ్ కలెక్టర్ కోరారు. నామినేషన్ దాఖలు చెసే వ్యక్తితో పాటు ప్రతిపాదకుడు తప్పని సరిగా రావాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సహయ రిటర్నింగ్ అధికారులు , రాజకియ పార్టీల ప్రతినిధులు వైసిపి , టీడీపీ , బీజేపీ , అప్ తదితరులు పాల్గొన్నారు.