Breaking News

అభ్యర్థిని ప్రతిపాదించే ప్రతిపాదకుడు తప్పని సరిగా హజరు కావాలి

-గురువారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ
-రాజమండ్రి రూరల్ ఆర్వో తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల 2024 రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ నోటిఫికేషన్ ను గురువారం ఉదయం విడుదల చెయ్యడం జరుగుతుందనీ , తదుపరి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందనీ జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం జాయింట్ కలక్టర్ ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, ఏప్రియల్ 18 నుంచి ఏప్రియల్ 25 వరకు ( ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11. గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలియ చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద 100 మీటర్లు వరకూ 144 సెక్షన్ అమలు లో ఉంటుందనీ తెలియ చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు 1+4 వరకూ మాత్రమే అనుమతిస్తామని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, పోటిలో నిలబడే అభ్యర్ధులు సహకరించాలని కోరారు. నామినేషన్ దాఖలు చెసే వ్యక్తితో పాటు ప్రతిపాదకుడు తప్పని సరిగా రావాలని తెలిపారు.  ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పిఓ , ఏపివో లకి శిక్షణ తరగతులు పూర్తి చేశామని, రెండోవ శిక్షణ వారికీ కేటాయించే నియోజక వర్గం లో రాండ్మాన్సైజేషన్ ద్వారా చేపట్టడం జరుగుతుందనీ తెలిపారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలు మేరకు క్రిటికల్ పొలింగ్ కేంద్రాల గుర్తించడం జరిగిందన్నారు. రూరల్ పరిధిలో 56 పీ ఎస్ గుర్తించామని అక్కడ వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్, మైక్రో అబ్జర్వర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో  సహయ రిటర్నింగ్ అధికారులు ఐ సాయి బాబా, వై వి కే అప్పా రావు, రాజకియ పార్టీల ప్రతినిధులు టీడీపీ గట్టెం సత్యనారాయణ, , కాంగ్రెస్ బీ.మురళీధర్, బిజెపి టీ. కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *