విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామి పథకంలో పని కోరిన ప్రతీ కూలీకి ఉపాధి కల్పిస్తున్నామని, జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డికి వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యుత్ త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకంలో పని కోరిన ప్రతీ కూలీకి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌తో ఉపాధి హామి పనులను భాగస్వామ్యం చేసి పనులు చేపట్టేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపి వేసవి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తూ త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా శివారు గ్రామ ఆవాసాలలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేసవిని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన నీటి సంరక్షణ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. విద్యుత్ కోత లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని సాంకేతిక సమస్య ఎదురైతే తక్షణమే పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డికి వివరించారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …