Breaking News

రైతుబజారులందు కొనుగోలు ధరకు టమోట అమ్మకాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రోజువారి టమోటా ధరల సమీక్షననుసరించి రిటైల్ మార్కెట్లో కిలో టమోట ధర రూ.55/- నుండి రూ.65/- పలుకుతుండగా రైతు బజారులలో ఈ ధర సగటున కేజి రూ.54/- పలుకుతుంది. పొరుగు రాష్ట్రాలలో ఈ సీజన్ నందు టమోట సాగు లేకపోవటం చేత మరియు మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మాత్రమే టమోట లభ్యం అవుతుండటం వలన మరియు వర్షాల ప్రభావం వల్ల టమోట ధర పెరగటం జరిగింది. పెరిగిన టమోట ధర దృష్ట్యా మార్కెటింగ్ శాఖ తక్షణ ధరల స్థిరీకరణ చర్యలకు సిద్ధం అయ్యి చిత్తూరు జిల్లాలోని టమోట మార్కెట్ల నుండి టమోట కొనుగోలు చేసి రైతుబజారులందు కొనుగోలు ధరకు టమోట అమ్మకాలు జరుపుటకు చర్యలు ముమ్మరం చేయటమైనది. గత పది రోజులో చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలోని మార్కెట్ల నందు సుమారు ౩౦ టన్నులు టమోట కోనుగోలు చేసి గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాలలోని రైతు బజార్ల యందు కోనుగోలు ధరలకే అమ్మటం జరిగినదని తెలియజేయడమైనది. సదరు ప్రక్రియ కొనసాగించబడుచున్నది. తత్సంభంధ కోనుగోలు ప్రక్రియ చేపట్టుటకు ప్రతి జిల్లా అధికారి అధినంలో రూ.5.00 లక్షలతో రివాల్వింగ్ ఫండ్ ను అందుబాటులో వుంచడమైనది.కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని మార్కెటింగ్ సంచాలకులు పి.ప్రశాంతి, I.A.S., ఓ ప్రకటనలో తెలిపారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *