Breaking News

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు కె.రామకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 5వ తేదీన దేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు వ్రాసారు. జూన్ 4న విడుదలైన నీట్ ఫలితాల్లో ఎన్నడూ లేని విధంగా దాదాపు 67 మందికి 720/720 మార్కులు వచ్చాయి. టాప్ స్కోర్ సాధించిన 67 మందిలో 6గురు హర్యానాలోని ఒకే పరీక్షాకేంద్రంలో పరీక్ష వ్రాయడంతోపాటు, ఆ తరువాత వచ్చిన రెండు ర్యాంకులు కూడా ఆ పరీక్షా కేంద్రం విద్యార్థులకే రావడంతో పలు అనుమానాలు తలెత్తి, విద్యార్థులు ఆందోళన చేపట్టారు.పరీక్షకు ఒకరోజు ముందే మే 4న పక్కా ప్లాన్ ప్రకారం పేపర్ లీక్ చేయడం; ఇందుకోసం బీహార్కు చెందిన ముఠా 35 మంది విద్యార్థుల నుండి రూ.30 లక్షల చొప్పున భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. పేపర్ లీకేజీ వ్యవహారం వైద్య విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. మరికొందరు విద్యార్థులకు 718, 719 మార్కులు వచ్చినట్లు తేలడంతో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ అవకతవకలు వెలుగుచూశాయి. నీట్ అవకతవకల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా, 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను కేంద్రం రద్దు చేసింది. ఏదేమైనా నీట్ విద్యార్థుల జీవితాలతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ చెలగాటమాడాయి.
కేంద్ర ప్రభుత్వ అసమర్థత, అధికారుల అలసత్వం కారణంగా లక్షలాది మంది నీట్ విద్యార్ధుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. దేశ వ్యాప్తంగా నీట్ అవకతవకల వ్యవహారం కుదిపేస్తున్నప్పటికీ ప్రధాని మోడీ స్పందించకపోవడం విచారకరం. నీట్ అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు బాధ్యత వహించాలి.నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలోని అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *