విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి అధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా యం సుహాసిని మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అమృత పర్యవేక్షణలో జిల్లాలో STOP Diarrhoea Campaign జూలై 1 వ తేది నుండి ఆగష్టు 31 వ తేది వరకూ అన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ యందు అంగన్వాడి కేంద్రంలలో నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలోప్రారంభోత్సవం లో ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు ఆయా నియోజకవర్గాల పరిధిలో హజరుకావడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది.
1)హెచ్ బి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం ఎమ్మెల్యే సృజనా చౌదరి. విజయవాడ వెస్ట్ ఉదయం 11.45 ని.లకు
2) అజిత్ సింగ్ నగర్-పట్టణ ఆరోగ్య కేంద్రం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ ఉదయం 11 గంటలకు
3)ఏపీఐఐసీ కాలనీ ., పట్టణ ఆరోగ్య కేంద్రం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు ఉదయం 10 గం
4)కొండపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం – ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే ఉదయం 10 గం లకు
5)రాజు గూడెం పి.హెచ్.సి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరు ఏంఏల్ఏ ఉదయం 11 గంటలకు
6) కొల్లా కాంప్లెక్స్.పట్టణ ఆరోగ్య కేంద్రం గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, జగ్గయ్యపేట ఉదయం 11 గంటలకు
7) లింగాలపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం- ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నందిగామ ఏం.ఏల్.ఏ ఉదయం 11 గంటలకు హాజరు అగుదురు అని తెలియజేయడమైనది.