న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 18వ లోక్సభ కొలు వుదీరిన విషయం తెలిసిం దే. జూన్ 24వ తేదీన 18వ లోక్సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఇక తొలి సమావేశాలు ముగియడంతో ఇప్పుడు కేంద్రం బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమా వేశాలు ప్రారంభం కానున్న ట్లు పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు శనివారం ప్రకటించారు. ఆగస్టు 12 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను జులై 23న లోక్సభలో ప్రవేశపెట్ట నున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యం తర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నిక ల అనంతరం పూర్తిస్థాయి లో బడ్జెట్ ప్రవేశపెట్టను న్నట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
Tags delhi
Check Also
ఆంధ్రప్రదేశ్లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …