అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంటక రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయడు ఫోన్ లో మాట్లాడారు. రమణారావు ఆచూకీ తెలియక నాలుగు రోజుల నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు…ఆయన ఒత్తడికి గురవ్వడానికి గల కారణాలు ఏంటి అని సీఎం అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని…..ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని ఆయన సతీమణి సునీత తెలిపారు. ఆమెతో పాటు, కుమారుడు సాయిరాంతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. గతంలో ఎప్పుడైనా ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని సీఎం అడిగారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని సీఎం అన్నారు. నిజాయితీ పరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం వద్ద ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తో కూడా సీఎం మాట్లాడి పలు సూచనలు చేశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని….ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు.
Tags AMARAVARTHI
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …