Breaking News

జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వివిధ భీమా సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదుల, మోటార్ వాహనాల యాక్సిడెంట్ కక్షిదారుల తరుపు న్యాయవాదుల తో జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సమావేశమయ్యారు. సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించేందుకు, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలన్నారు. త్వరలో నిర్వహించనున్న ముందస్తు లోక్ అదాలత్ సమావేశాల్లో భీమా సంస్థల వారు, యాక్సిడెంట్ కేసుల్లోని బాధితులు, ఇరు పక్షాల న్యాయవాదులు పాల్గొవాలని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు, వివిధ భీమా సంస్థల ప్రతినిధులు, భీమా సంస్థల కౌన్సెల్స్, మోటార్ వాహనాల యాక్సిడెంట్ కక్షిదారుల తరుపు న్యాయవాదుల తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *