రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యన్ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ నుండి కంబాల చెరువు వరకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, అధికారులు, ఉద్యోగులు , విద్యార్థిని విద్యార్థులతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు . అనంతరం స్థానిక బొమ్మూరులోని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
Tags rajamandri
Check Also
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం
-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …
Prajavartha Online Telugu News