Breaking News

ఆతిథ్య రంగం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండు

-ఒబెరాయ్ హోటల్ నిర్మాణ స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలోని దేవ్ లోక్ నందు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.

గురువారం ఉదయం స్థానిక పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సమీపంలోని దేవ్ లోక్ నందు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో తిరుమల ఏడు కొండల స్వామి వారు, జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం తదితర పుణ్య క్షేత్రాలు, తూపిలి పాలెం బీచ్, ఇరకం దీవులు, తలకోన తదితర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, తిరుపతి జిల్లా వైద్య హబ్ గా, ఉన్నత విద్యా సంస్థలు కలిగి విద్యా హబ్ గా, పారిశ్రామిక సెజ్ లు కలిగి పరిశ్రమల హబ్ గా, రైల్, రోడ్డు, విమానాశ్రయ సదుపాయాలు కలిగి ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి రోజూ ప్రపంచ నలు మూలల నుండి తిరుపతి జిల్లాలో సుమారు 75 వేల నుండి లక్ష మంది దాకా పర్యాటకులు, విద్యార్థులు, ప్రజలు విచ్చేస్తుంటారు అని, ఈ నేపథ్యంలో ఒబెరాయ్ వంటి సెవెన్ స్టార్, హయత్ వంటి ప్రముఖ హోటల్ లు జిల్లాలో నెలకొల్పడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కూడా సమకూరుతుంది అని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో సదరు అంశపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జూ క్యూరేటర్ సెల్వం, ఆర్డీఓ నిషాంత్ రెడ్డి , జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపెంద్ర నాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *