-మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ప్రశంస
-ముంపు గ్రామాల్లో రూ 5 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తాం
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-దక్షిణ చిరువోలులంక వరద బాధితులకు టీడీపీ ఎన్నారై బొబ్బా గోవర్ధన్ సహాయంతో మధ్యాహ్న భోజనం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విపత్తును ఎదుర్కోవటంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు. శనివారం అవనిగడ్డ మండలం రామచంద్రాపురం పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాసం పొందుతున్న దక్షిణ చిరువోలులంక వరద బాధితులను మాజీ ఎంపీ నారాయణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్నారై బొబ్బా గోవర్ధన్ ఆర్థిక సహకారంతో అవనిగడ్డ మండల టిడిపి ఆధ్వర్యంలో వరద బాధితులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దాతలు, స్వచ్చంద సంస్థలు, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు విస్తృతంగా వరద ప్రభావిత గ్రామాల్లో బాధితులకు అండగా నిలిచారని తెలిపారు. మునుపెన్నడు లేని స్థాయిలో రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు మంచి సౌకర్యాలు లభించాయన్నారు. వరద కారణంగా గ్రామాలు, పంటలకు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నిధులు రాగానే పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాణాలకు తెగించి బాధిత కుటుంబాల వారికి అండగా నిలిచారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులను రూ.లక్ష చొప్పున రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చి అండగా నిలిచారన్నారు. నియోజకవర్గంలో వరద ప్రభావిత గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లన్నిటిని ఉపాధి హామీ పథకం నిధులు రూ.ఐదు కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. దెబ్బతిన్న ఆర్.అండ్.బి, జడ్పీ రోడ్లు అభివృద్ధి చేస్తామన్నారు. ఈ వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రతి ఒక్కరు అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయటంతో వరద బాధితులు సంతోషంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఎంపీటీసీ బొప్పన భాను, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గుడివాక శివరావు, బండే రాఘవ, బచ్చు రఘునాధ్ ప్రసాద్, బచ్చు కృష్ణకుమారి, లుక్కా పిచ్చియ్య, మేడికొండ విజయ్, మొగల్ మురాద్, యలవర్తి ఆది, భోగిరెడ్డి బుజ్జి, కర్రా సుధాకర్, కూనపరెడ్డి చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.