Breaking News

ఎం.ఎస్.ఎం.ఈ.లను ప్రోత్సహించేలా త్వరలో నూతన విధానం

-క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్టు ద్వారా రూ.5 వేల కోట్లు ఋణ సౌకర్యం
-రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా త్వరలో నూతన ఎం.ఎస్.ఎం.ఈ.విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మరింత బలోపేతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సచివాలయంలో సమీక్ష జరిగినట్లు ఆయన తెలిపారు. 2014-19 మద్య కాలంలో ఎమ్.ఎస్.ఎం.ఈ.లను ప్రోత్సహిస్తూ పలు విధానాలు అమలు చేయడంతో పాటు 2018 లోనే ఎం.ఎస్.ఎం.ఈ. డవలెప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి కేంద్ర నిధులను పెద్ద ఎత్తున వినియోగించుకోవడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ విధానాలు అన్నీ పూర్తిగా నీరుగారిపోయాయని, ఎమ్.ఎస్.ఎం.ఈ. లు పలు ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగిందన్నారు. దాదాపు రూ.1,500 కోట్ల మేర ప్రోత్సహకాలను ఎమ్.ఎస్.ఎం.ఈ. చెల్లింపు చేయకుండా నిలుపుదల చేసిందన్నారు. అటు వంటి ఇబ్బందికర పరిస్థితులను అన్నింటినీ అధిగమిస్తూ ఎమ్.ఎస్.ఎం.ఈ.ల్లో నూతనోత్సహాన్ని తీసుకువచ్చే విధంగా తగు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఎటు వంటి కొలేటరల్ గ్యారెంటీ లేకుండా ఎమ్.ఎస్.ఎం.ఈ.లకు దాదాపు రూ.5 వేల కోట్ల మేర ఋణ సౌకర్యం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు పర్చే క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్టుకు రూ.100 కోట్ల గ్రాంట్ ను ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు. ర్యాంప్ కార్యక్రమం క్రింద రాష్ట్రానికి రూ.100 కోట్ల మేర నిధులను కేంద్రం మంజూరు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని టీ, కిరణా షాపులు మొదలుకొని అన్ని ఎం.ఎస్.ఎం.ఈ.లను రిజిష్టరు చేసి వాటి అభివృద్దికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంపొందిస్తూ, వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కామన్ ఫెసిలిటీస్ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల ఎం.ఎస్.ఎం.ఈ.లను పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు, వాటికి అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. జిల్లాల విభజనకు ముందు 13 ఉమ్మడి జిల్లాల్లోనే జిల్లా పరిశ్రమల కేంద్రాలు ఉన్నాయని, అవి కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయన్నారు. వాటితో పాటు నూతన జిల్లాల్లో కూడా జిల్లా పరిశ్రమల కేంద్రాలను ఏర్పాటు చేసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆయా కేంద్రాలను అనుసంధానం చేసి ఎం.ఎస్.ఎం.ఈ.లకు అవసరమైన అత్యుత్తమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏ.పి.ఐ.ఐ.సి.ల్లో ఎంతో భూమి అందుబాటులో ఉందని, ప్రస్తుతం ఉన్న పార్కులకు అదనంగా మరో 50 పార్కులను, పిపిపి విదానంలో మరిన్ని పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ట్రేడ్ ప్రొమోషన్ కార్పొరేషన్ను కూడా బలో పేతం చేసేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో వృత్తి నైపుణ్యాన్ని అభిపర్చేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అచ్చ్యుతాపురం పూడిలో రూ.250 కోట్లతో టెక్నాలజీ కేంద్రాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా అమరావతిలో కూడా మరో టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రెండు కేంద్రాలను అనుసంధానం చేస్తూ హబ్ అండ్ స్పోక్ మోడల్ లో మరో పది కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెద్ద ఎత్తున పెంచేందుకు పటిష్టమైన చర్యలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *