Breaking News

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సమీక్ష సమావేశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సెక్రటరియేట్లో గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు..రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ మన్నిక ఉండేలా, త్వరతగతిన పూర్తి అయ్యేలా రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు..పాత పద్దతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్, టెక్నాలజీ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై ఆలోచించాలని సీఎం తెలిపినట్లు వారికి వివరించారు..రోడ్ల అభివృద్ధి విషయంలో 3 అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు..ముందుగా డ్రోన్ టెక్నాలజీ వినియోగించి ఎక్కడెక్కడ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలో తెలుసుకోవాలన్నారు.. ప్రాధాన్యత క్రమంలో మొదట గుంతలు(Potholes)పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.. తర్వాత రోడ్లపై పడిన గండ్లను, తెగిపోయిన రహదారులను మరమ్మత్తు చేయాలన్నారు.. మూడో అంశంగా రోడ్ స్టాటిస్టిక్స్ డేటా సేకరించాలన్నారు.సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ను సంప్రదించి ఓఆర్ఆర్ నిర్మాణానికి అవసరమైన భూమి వివరాలు సేకరించాలని తెలిపారు. రాష్ట్రంలో రూ.58,874 కోట్లతో 105 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లు పురోగతిలో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సిఎస్ కి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఆర్ అండ్ బి ఐఎన్ సి కే. నయీముల్లా, సీఈ ఎన్ హెచ్ రామచంద్ర, ఏపీఆర్డీసీ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *