-కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 3 వ తేదీ నుండి నిర్వహించనున్న దసరా శరనవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి యిబ్బందులు కలగకుండా అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. సృజన సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలను అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈ ఓకే ఎస్ రామారావు తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన, పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనాన్, సబ్ కలెక్టర్ భవానీ శంకర్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు, మునిసిపల్, రెవిన్యూ, పోలీస్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ , ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, సంబంధిత శాఖల అధికారులుతో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించు దసరా -2024 మహోత్సవములు నిమిత్తం బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి కార్యాలయం లో సమన్వయ సమావేశం శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆలయ ఈవో కె ఎస్ రామరావు దసరా నవరాత్రులలో శ్రీ అమ్మవారి అలంకారం వివరములు, దర్శనం, పూజలు వివరములు, వివిధ ప్రదేశములలో ప్రసాదం, దర్శనం, కల్యాణకట్ట కౌంటర్లు ఏర్పాటు నిర్వహణ, స్నానం ఘాట్లు నందు ఏర్పాట్లు, త్రాగు నీరు ఏర్పాట్లు, శానిటేషన్, సెక్యూరిటీ ఏర్పాట్లు, రద్దీ కి అనుగుణముగా క్యూ లైన్ ఏర్పాట్లు, డ్యూటీ వాహనములు మూవ్ మెంట్, వీఐపీ మూవీ్మెంట్, గత సంవత్సరం వివరములు, ఈ సంవత్సరం నందు అంచనాలు, తధనుగుణముగా ఏర్పాట్లు, మునిసిపల్, పోలీస్, అగ్నిమాపక, వైద్య, పిడబ్ల్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ ఇతర విభాగాముల నుండి కావలసిన ఏర్పాట్లు తదితరముల గురించి చర్చించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ తమ విభాగముల వారు గత అనుభవములు మరియు ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ సోమవారం క్షేత్ర స్థాయిలో అన్ని విభాగముల అధికారులతో కలిసి ఇన్స్పెక్షన్ నిర్వహించబడునని, అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించబడునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లా & ఆర్డర్ డిసిపి గౌతమ్ శాలి, ట్రాఫిక్ డీసీపీ కృష్ణ మూర్తి నాయుడు, ఏడీసీపీ రామకృష్ణ, ఆలయ ఈఈ లు కె వి ఎస్ కోటేశ్వరరావు, లింగం రమ, డిప్యూటీ ఈవో లీలా కుమార్, ఏఈఓ లు, పర్యవేక్షకులు, ఇంజినీరింగ్ అధికారులు, 1 టౌన్ ఏ సి పి, సీఐ, ఎస్ ఐ, అగ్నిమాపక, ఎలక్ట్రిసిటీ, వైద్య ఆరోగ్యశాఖ మునిసిపల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.