ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. కుటుంబం గురించి ఆరా తీయగా తమకు ఐదు ఎకరాల పొలం ఉందని, మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ, జామాయిల్ సాగుచేస్తున్నానని జగ్గయ్య చెప్పారు. అయితే శనగలో నష్టం వచ్చిందని ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం తనకు వృద్ధాప్య పింఛను వస్తున్నట్లు ముఖ్యమంత్రికి ఆయన చెప్పారు. తనలాంటి రైతుల పై భారం పడకుండా ఎరువుల రేట్లు తగ్గించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.
Prajavartha Online Telugu News