Breaking News
????????????????????????????????????

వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్,ఎచీవ్మెంట్ కింద 63 అవార్డులు ప్రకటన…

-వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుకు రూ.10లక్షలు నగదు,జ్ణాపిక
-వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5లక్షలు నగదు, జ్ణాపిక
-ఆగష్టు 14 లేదా 15వతేదీన అవార్డులు ప్రధానం
-పూర్తిపారద్శకత నిష్పాక్షికతతో అవార్డులకు ఎంపిక
ప్రభుత్వ సలహాదారు కమ్యునికేషన్స్ జివిడి కృష్ణమోహన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2021 ఏడాదికి సంబంధించి వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైయస్సార్ అచీవ్మెంట్ కింద 63 అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, కమ్యునికేషన్స్ మరియు వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు జివిడి కృష్ణమోహన్ ఈఅవార్డుల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతే ఏడాదే వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్,వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డులను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించగా కరోనా పరిస్థితులు కారణంగా వాయిదా వేసి ఈ ఏడాది ఈ అవార్డులను ప్రకటించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని పలు రంగాల్లో వివిధ సంస్ధలు, వ్యక్తులు సమాజానికి అందించిన సేవలను గుర్తించి పూర్తి పాదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈఅవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని కృష్ణ మోహన్ వెల్లడించారు. ఈఅవార్డులకు ఎంపికకై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయగా అవార్డుల ఎంపికలో అన్ని జిల్లాల కలక్టర్లు,వివిధ శాఖాధికారులు,పలు సంస్థలు, పలువురు వ్యక్తులు తదితరుల భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సామాన్యుల్లో అసామాన్యులను గుర్తించి వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ మరియు అచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని జివిడి కృష్ణమోహన్ పేర్కొన్నారు.తెలుగు వారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ స్థాయిల్లో అనేక రంగాల్లో విశేష సేవలందిస్తున్నారని చెప్పారు.తెలుగువాడు అంటే నిండైన వ్యక్తిత్వం కలిగిన వారిలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారని అలాంటి వ్యక్తిపేరిట ఈఅవార్డులను ప్రకటించడం వాటికి తగిన అర్హతకలిగిన వ్యక్తులు,సంస్థలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ గత కొద్ది నెలలుగా విస్తృతమైన కసరత్తును చేపట్టి అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు.వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ కింద 50 ఈఅవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ 63 అవార్డులను ప్రకటిచండం జరిగిందని ఆయన చెప్పారు.
వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు రూ.10లక్షలు నగదు, జ్ణాపిక, వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5లక్షలు నగదు, జ్ణాపికను అందించడం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు కమ్యునికేషన్స్ జివిడి కృష్ణమోహన్ మీడియాకు వెల్లడించారు. ఈ అవార్డులను ఆగష్టు 14న లేదా 15వ తేదీన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని అయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా ఈ వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్,వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డులను ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. 6కేటగీరీల కింద మొత్తం 63 అవార్డులను ప్రకటించడమైందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టాఫ్ ఆఫీసర్ టు సిఎస్ విజయకృష్ణన్,ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి,ఆప్కో జియం ఎల్.రమేశ్, సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్,మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

వైయస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌/ఎచీవ్‌మెంట్‌ అవార్డులు : జాబితా
సంస్థలు (అన్నింటికీ లైఫ్‌ టైమ్‌)
1) ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ ట్రస్ట్‌ – కాకినాడ, తూర్పు గోదావరి
2) సీపీ బ్రౌన్‌ లైబ్రరీ – వైయస్సార్‌ జిల్లా
3) సారస్వత నికేతన్‌ లైబ్రరీ – వేటపాలెం,ప్రకాశం
4) శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ – అనంతపురం
5) ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌ – వైయస్సార్‌ జిల్లా
6) రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ – అనంతపురం
7) శ్రీ గౌతమి రీజినల్‌ లైబ్రరీ – రాజమండ్రి, తూర్పుగోదావరి
8) మహారాజాస్‌ గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ – మ్యూజిక్‌ – విజయనగరం
రైతులు
1) స్వర్గీయ పల్లా వెంకన్న (లైఫ్‌ టైమ్‌) – కడియం నర్సరీల వ్యవస్థాపకుడు
2) మాతోట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – శ్రీకాకుళం
3) ఎం.సి.రామకృష్ణారెడ్డి – అనంతపురం
4) కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం
5)  విఘ్నేశ్వర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ – కృష్ణా
6) ఎం.బలరామిరెడ్డి – వైయస్సార్‌జిల్లా
7) ఎస్‌.రాఘవేంద్ర – చిత్తూరు
8) సెగ్గె కొండల్‌రావు – విశాఖపట్నం
9) ఆంధ్ర కశ్మీర్‌ ట్రైబల్‌ ఫార్మింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ – విశాఖపట్నం
10) వల్లూరు రవికుమార్‌ – కృష్ణా
11) శివ అభిరామరెడ్డి – నెల్లూరు

కళాకారులు
1) పొందూరు వస్త్రాలు– ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం–లైఫ్‌ టైం– శ్రీకాకుళం
2) జానపద గేయం– స్వర్గీయ వంగపండు ప్రసాదరావు–లైఫ్‌ టైం– విజయనగరం
3) బొబ్బిలి వీణ– శ్రీ బొబ్బిలివీణ కేంద్రం (అచ్చుత నారాయణ)–లైఫ్‌ టైం– విజయనగరం
4) ధింసా నృత్యం– కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం – విశాఖపట్నం
5) రంగస్థలం–  పొన్నాల రామసుబ్బారెడ్డి– లైఫ్‌ టైం – నెల్లూరు
6) సురభి నాటకం– (శ్రీ వినాయక నాట్య మండలి) – సురభి డ్రామా– లైఫ్‌ టైం –వైయస్సార్‌ జిల్లా
7) సవర పెయింటింగ్స్‌ –  సవర రాజు – శ్రీకాకుళం
8) వీధి నాటకం–  మజ్జి శ్రీనివాసరావు – విశాఖపట్నం
10) డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌– ధర్మాడి సత్యం – తూర్పు గోదావరి
11) హరికథ–  సర్వారాయ హరికథా పాఠశాల (మహిళ) – తూర్పు గోదావరి
12) బుర్రకథ–  మిరియాల అప్పారావు – పశ్చిమ గోదావరి
13) కొండపల్లి బొమ్మలు –  కూరెళ్ల వెంకటాచారి– కృష్ణా
14) డప్పు కళాకారుడు–  గోచిపాత గాలేబు – కృష్ణా
15) వెంకటగిరి జమదానీ చీరలు–  జి.రమణయ్య– నెల్లూరు
16) కలంకారీ పెయింటింగ్స్‌–  శివప్రసాదరెడ్డి– కర్నూలు
17) ఉడ్‌ కార్వింగ్స్‌–  బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ ఆర్జిజాన్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌– చిత్తూరు
18) లెదర్‌ పప్పెట్రీ–  దాలవాయి చలపతి– లైఫ్‌ టైం– అనంతపురం
19) నాదస్వరం– డాక్టర్‌ వి.సత్యనారాయణ– చిత్తూరు
20) కేలిగ్రఫీ– పూసపాటి పరమేశ్వరరాజు– విజయనగరం
21) కూచిపూడి నాట్యం– సిద్ధేంద్రయోగి కళా క్షేత్రం–లైఫ్‌ టైం– కూచిపూడి– కృష్ణా జిల్లా

రచయితలు (అందరికీ లైఫ్‌ టైం)
1)  స్వర్గీయ కాళిపట్నం రామారావు (కారా మాస్టర్‌)– శ్రీకాకుళం
2)  కత్తి పద్మారావు – అభ్యుదయ సాహిత్యం –గుంటూరు
3)  రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి– సాహిత్యం – వైయస్సార్‌ జిల్లా
4)  బండి నారాయణస్వామి – సాహిత్యం– అనంతపురం
5)  కేతు విశ్వనాథరెడ్డి – సాహిత్యం– వైయస్సార్‌ జిల్లా
6)  కొనకలూరి ఇనాక్‌ – సాహిత్యం– గుంటూరు
7)  లలితకుమారి (ఓల్గా) – సాహిత్యం– గుంటూరు

పాత్రికేయులు (అందరికీ లైఫ్‌ టైం)
1)  పాలగుమ్మి సాయినాథ్‌ – చెన్నై
2)  ఏబీకే ప్రసాద్‌ – కృష్ణా
3) స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు
4) స్వర్గీయ షేక్‌ ఖాజా హుస్సేన్‌ (దేవీప్రియ) – గుంటూరు
5) స్వర్గీయ కె.అమర్‌నాథ్‌ – పశ్చిమ గోదావరి
6)  సురేంద్ర –కార్టూనిస్ట్‌ –కడప
7)  తెలకపల్లి రవి – కర్నూలు
8)  ఇమామ్‌ – అనంతపురం

కోవిడ్‌ వారియర్స్‌
1) డాక్టర్‌ నీతిచంద్ర – ప్రొఫెసర్‌ పల్మనాలజీ – నెల్లూరు
2) డాక్టర్‌ కె.కృష్ణకిషోర్‌ – ప్రొఫెసర్‌ ఈఎన్‌టీ – కాకినాడ
3)  లక్ష్మి – స్టాఫ్‌ నర్స్‌ – జీజీహెచ్‌. విజయవాడ
4) కె.జ్యోతిర్మయి – స్టాఫ్‌ నర్స్‌ – అనంతపురం
5) తురుబిల్లి తేజస్వి – స్టాఫ్‌ నర్స్‌ – విశాఖపట్నం
6) ఎం.యోబు – మేల్‌ నర్సింగ్‌ – నెల్లూరు
7) అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ – గుంటూరు
8) ఆర్తి హోమ్స్‌ – వైయస్సార్‌ కడప

మొత్తంగా 63 అవార్డులు…

 

 

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *