-సైకిల్ థన్ ద్వారా స్వచ్ఛత హి సేవ పై అవగాహన ప్రజల సహకారంతోనే సాధ్యం – ధ్యానచంద్ర, కమిషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయల భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ఈట్ స్ట్రీట్ వద్ద నిర్వహించిన సైకిల్ థాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛత అంటే కేవలం పరిసరాల పరిశుభ్రత మాత్రమే కాదు కాలుష్యం పరిశుభ్రత అని కాలుష్య రహిత సమాజంగా విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడేందుకు సైకిల్ థన్ కార్యక్రమాలు విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహించటం ఎంతో గర్వకారణమని విజయవాడ నగర ప్రజలు కూడా కనీస సెలవు దినాల్లో అయినా సైకిల్లు తొక్కే అలవాటును అలవర్చుకోవాలని తద్వారా పొల్యూషన్ తగ్గించడమే కాకుండా విజయవాడ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చని తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని నిర్వహించిన సైకిల్ థన్ కార్యక్రమంలో కేవలం పరిసరాల పరిశుభ్రతం గురించి అవగాహన కల్పించడానికి సైకిల్ ర్యాలీని మాత్రమే కాకుండా సైకిల్ తొక్కడం వల్ల కాలుష్యరహిత సమాజాన్ని ఏర్పడటానికి తోడ్పడటానికి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రజలు, వాళ్లలో చైతన్యం కల్పించటమే కాకుండా వారి ద్వారా ఇతరులకు కూడా ఇటువంటి విషయాలపై అవగాహన కల్పించేటట్టు స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరానికి వరదలు తర్వాత మనం ప్రజల సహకారంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విస్తృతంగా చేశారని తెలిపారు.
తదుపరి మేయర్ రాయన భాగ్యలక్ష్మి జెండా ఊపి సైకిల్థన్ ప్రారంభించారు కమిషనర్ ధ్యానచంద్ర, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు, అధికారులు, సైకిల్ తొక్కి ఈ స్ట్రీట్ నుండి ప్రారంభమై బందు రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్ వైపుగా యూటర్న్ తీసుకొని తిరిగి ఈ స్ట్రీట్ వద్దకు చేరుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ చీరన్ రాయ్, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, ప్రజలు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.