Breaking News

చీపురు పట్టి విఎంసి ఆఫీస్ శుభ్రపరిచిన మేయర్, కమిషనర్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తామే స్వయంగా చీపుర్లు పట్టి విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయమును పరిశుభ్రపరచిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పరిసరాలను పరిశుభ్రపరుస్తూ మహాత్ముని స్మరించుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద కమిషనర్ ధ్యానచంద్ర, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గాంధీ కి ఎంతో ఇష్టమైన స్వచ్ఛత ఇప్పుడు దేశం మొత్తం పాటిస్తోందని, ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థలో స్వచ్ఛత హి సేవ అంటూ సెప్టెంబర్ 17 నుండి మొదలుపెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారని, విజయవాడ స్వచ్ఛ సర్వేక్షన్ లో కూడా గత మూడు సంవత్సరాలలో ర్యాంకులు సాధించిందని అందుకు ముఖ్య కారణం పారిశుద్ధ్య కార్మికులే కాకుండా ప్రజలు కూడా అని అన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, విజయవాడ నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, గాంధీ ఎప్పుడూ ఒక మాట అనేవారని, స్వచ్ఛత గురించి మనం మాట్లాడాలంటే మనం ముందుగా చీపిరి పట్టుకొని స్వచ్ఛతను చూపించాలని, అలాగే ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ సర్వేక్షన్ లో విజయవాడ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తెలిపారు. తదుపరి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో ప్రజల మద్దతు, స్వచ్ఛత గురించి అవగాహన కల్పించే సెల్ఫీ స్టాండ్లలో పారిశుద్ధ్య కార్మికులు కార్పొరేషన్ సిబ్బందితో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర సెల్ఫీ దిగి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, చీఫ్ సిటీ ప్లానర్ జీ వి జీ ఎస్ వి ప్రసాద్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ పి సత్యనారాయణ, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్, మేనేజర్ ఏయూబి శర్మ, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *