విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానది రిటర్నింగ్ వాల్ నిర్మాణలో ఇళ్ళలను తొలగించి వారికీ నగరపాలక సంస్థ ద్వారా సింగ్ నగర్ ప్రాంతంలోని జె.ఎన్.ఎన్.యు.ఆర్.యం పథకం ద్వారా నిర్మించిన జి+3 గృహా సముదాయాలలో వసతులను జిల్లా కలెక్టర్ గురువారం స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలసి సింగ్ నగర్ వాంబే కాలనీ నందు పునరావాసం కలిపించిన గృహ సముదాయాలలో పరిశీలించారు. తదుపరి సాంబమూర్తి రోడ్ నందు నిర్మాణములో ఉన్న రైతు బజార్ పనులు మరియు లెనిన్ సెంటర్ నందు చేపట్టిన ఐలాండ్ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …