Breaking News

జనహృదయ నేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి…

-దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు
-న‌గ‌ర వ్యాప్తంగా మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ న‌గ‌రంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. తొలుత పోలీస్ కంట్రోల్ రూం వ‌ద్ద నున్న వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రి వెలంప‌ల్లి, ఎమ్మెల్సీ క‌రీమున్నిసా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, డిప్యూటి మేయ‌ర్ బెల్లం దుర్గ‌, వైసీపీ న‌గ‌రాధ్య‌క్షులు బొప్ప‌న భ‌వ‌కుమార్ త‌దిత‌రుల‌తో క‌లిసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అనంత‌రం భారీ కేకు క‌ట్ చేసి అభిమానుల‌కు అంద‌జేశారు.
మంత్రి వెలంప‌ల్లి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని, తండ్రి బాటలోనే సీఎం వైఎస్‌ జగన్ పయనిస్తున్నారు. సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే సీఎం జగన్‌ వంద అడుగులు ముందుకు వేస్తున్నారు అని తెలిపారు.
వైద్యం అందక ఆగిపోతున్న గుండెకు భరోసాగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్‌ వైద్యాన్ని అందించారు. 108తో ఎంతోమందికి పున‌ర్జీవం పోశారు. అలాగే ఫీజురీయింబర్స్‌మెంట్‌ ద్వారా పేదింటి బిడ్డల పెద్ద చదువులకు గ్యారంటీ అయ్యారు. ”మీరెంత చదువుతారో చదవండి.. డాక్టర్‌ చదువుతారా.. ఇంజినీరింగ్‌ చేస్తారా.. మీ ఇష్టం.. మిమ్మల్ని చదివించే బాధ్యత నాది” అని విద్యార్థుల భవిష్యత్తును కూడా తన భుజానికి ఎత్తుకున్నారు.. పేదలందరి జీవితాల్లో వైఎస్ఆర్ వెలుగులు నింపారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.

అనంత‌ర న‌గ‌రంలో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 53వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ మ‌హాదేవ్ అప్పాజీ అధ్వర్యంలో రాయ‌ల్ హోట‌ల్ వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మం పాల్గొన్ని వైఎస్ చిత్ర‌ప‌టానికి నివాళులర్పించారు. అనంత‌రం పేద‌ల‌కు అన్న‌దానం చేశారు. 51వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌ మ‌రుపిళ్ల రాజేష్ అధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్ని వైఎస్ చిత్ర‌ప‌టానికి నివాళులర్పించి రాజాహైస్కూల్ వ‌ద్ద పేద‌ల‌కు పండ్ల అంద‌జేశారు. 48వ డివిజ‌న్ బంగార‌య్య కోట్టు వ‌ద్ద కార్పొరేట‌ర్‌ అల్లూరి అదిల‌క్ష్మి అధ్వ‌ర్యంలో వైఎస్ చిత్ర‌ప‌టానికి నివాళులర్పించిన మంత్రి పేద‌లకు పండ్లు పంపిణీ చేశారు. 50వ డివిజ‌న్ పొట్టి శ్రీ‌రాములు ఇంజ‌నీరింగ్ కాలేజీ వ‌ద్ద బంకా విజ‌య్ అధ్వ‌ర్యంలో వైఎస్ చిత్ర‌ప‌టానికి నివాళులర్పించిన మంత్రి పేద‌లకు దుప‌ట్ల మ‌రియు పండ్లు పంపిణీ చేశారు. 55వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌ శీరం పూర్ణ చంద్ర‌రావు అధ్వ‌ర్యంలో నైజం గేట్ అంబేద్క‌ర్ విగ్ర‌హాం వ‌ద్ద చీరాల పంపిణి చేశారు. 49వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌ బుల్లా విజ‌య్ కుమార్ అధ్వ‌ర్యంలో మంత్రి వెలంప‌ల్లి పైజ‌ర్ పేట వైఎస్ ఆర్‌ విగ్ర‌హాం వ‌ద్ద పేద‌ల‌కు పండ్లు పంపిణీ చేశారు. . 47 వ డివిజ‌న్ చిట్టిగారి పార్క్ వ‌ద్ద కార్పొరేట‌ర్ గొదావ‌రి గంగా అధ్వ‌ర్యంలో పేద‌ల పండ్ల పంపిణి చేశారు. 46వ డివిజ‌న్ భీమ‌న‌వారి పేట వ‌ద్ద మేయ‌ర్ అధ్వ‌ర్యంలో పేద‌ల కు పండ్ల పంపిణీ చేశారు. 43వ డివిజ‌న్ ఊర్మిళా న‌గ‌ర్ వైఎస్ ఆర్ విగ్ర‌హాం వ‌ద్ద భూప‌తి కార్పొరేట‌ర్ కోటిరెడ్డి అధ్వ‌ర్యంలో పేద‌ల‌కు పండ్ల పంపిణి చేశారు. 42వ డివిజ‌న్ భ‌వానీపురం శివాల‌యం సెంట‌ర్ వ‌ద్ద కార్పొరేట‌ర్ చైత‌న్య రెడ్డి అధ్వ‌ర్యంలో పేద‌లకు పండ్ల పంపిణీ చేశారు. 41వ డివిజ‌న్ భ‌వానీపురం మ‌సీద్ రోడ్డు వ‌ద్ద కార్పొరేట‌ర్ ఎండి ఇర్పాన్ అధ్వ‌ర్యంలో పేద‌ల‌కు పండ్ల పంపిణీ చేశారు.
40వ డివిజ‌న్ బ్యాంకు సెంట‌ర్ వ‌ద్ద కార్పొరేట‌ర్ అంజ‌నేయ రెడ్డి అధ్వ‌ర్యంలో పేద‌ల‌కు పండ్ల పంపిణి చేశారు. 39వ డివిజ‌న్ సిమెంట్ రోడ్డు బ‌స్టాండ్ వ‌ద్ద‌(మొయిన్ రోడ్డు) కార్పొరేట‌ర్ గుడివాడ న‌రేంద్ర అధ్వ‌ర్యంలో పేద‌ల‌కు పండ్ల పంపిణి చేశారు. 44వ డివిజ‌న్ చెరువు సెంట‌ర్ వ‌ద్ద కార్పొరేట‌ర్ మైల‌వ‌ర‌కు ర‌త్న‌కుమారి అధ్వ‌ర్యంలో పేద‌ల‌కు పండ్లు, చీరలు పంపిణీ చేశారు అనంతరం నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. 45వ డివిజ‌న్ సితార సెంట‌ర్ వ‌ద్ద బ‌ట్టి పాటి సంధ్య రాణి అధ్వ‌ర్యంలో పేద‌ల‌కు పండ్ల పంపిణీ చేశారు. 56 వ డివిజ‌న్ పార్టీ కార్యాల‌యం వద్ద కార్పొరేట‌ర్ య‌ల‌క‌ల చ‌ల‌ప‌తి రావు అధ్వ‌ర్యంలో పేద‌ల పండ్లు పంపిణీ చేశారు. 34వ డివిజ‌న్ ఎర్ర‌క‌ట్ట డౌన్ లో ఖుద్దుస్ న‌గ‌ర్‌లో వైఎస్ ఆర్ విగ్ర‌హం వ‌ద్ద కార్పొరేట‌ర్ బండి పుణ్య శీల అధ్వ‌ర్యంలో పేద‌ల‌కు అన్న‌దానం చేశారు. 35వ డివిజ‌న్ బాప్టిస్టు పాలెం అంబెద్క్‌ర్ విగ్ర‌హాం వ‌ద్ద కార్పొరేట‌ర్ బ‌ల‌సాని మునిమ్మ‌పేద‌ల‌కు పండ్లు పంపిణి చేశారు.
38వ డివిజ‌న్ జ‌మీదోడ్డి వ‌ద్ద కార్య‌క్ర‌మం హ‌య‌త్ అధ్వ‌ర్యంలో చిరువ్యాపారులకు తోపుడు బ‌ళ్లు అంద‌జేశారు. 52వ డివిజ‌న్ మ‌ల్లిఖార్జున పేట నాలుగు పంపు సెంట‌ర్ వద్ద తంగేళ్ల రామ‌చంద్ర‌రావు అధ్వ‌ర్యంలో పేద‌ల‌కు పండ్లు, దుప్పట్లు పంపిణి చేశారు. 37 డివిజ‌న్ కార్పొరేట‌ర్ మండెపూడి చ‌ట‌ర్జి అధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించి, పేద‌ల‌కు పండ్ల పంపిణి చేశారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *