Breaking News

రైతుకు వెన్నుదన్నుగా డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ : మంత్రి పేర్ని నాని


మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో పంటలకు సోకె తెగుళ్లు బట్టి వ్యవసాయ అధికారులు పురుగు మందులు సూచించే పద్ధతికి స్వస్తి పలికి పంటకు సోకే తెగుళ్ళ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే సరైన మోతాదులో తగిన మందులను రైతులకు ఇచ్చే డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ లాబ్స్ ఇకపై మన రాష్ట్రంలో దర్శనమిస్తాయిని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. గురువారం ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డ్ లో రైతు దినోత్సవం పునస్కరించుకొని 96 లక్షల 80 వేల రూపాయలతో నిర్మించబడిన డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు నాణ్యత నిర్ధారణ, భూసార, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరీక్షలు వ్యవసాయ ల్యాబ్ల్లో నిర్వహిస్తారని వివరించారు. పై అంతస్థులో ఏర్పాటుచేసిన డాక్టర్ వైస్సార్ ఆక్వాకల్చర్ ప్రయోగశాల ద్ద్వారా మట్టి , నీటి సాంద్రత, మేతల నాణ్యత తనిఖీ, చేపల రొయ్యల వ్యాధుల నిర్ధారణ ఇక్కడ శాస్త్రీయంగా పరీక్ష చేస్తారని తెలిపారు. వీరికి తోడు వ్యవసాయశాఖ, వెటర్నరీ, ఆక్వా అసిస్టెంట్లు రైతు భరోసా కేంద్రాల్లోనే పనిచేస్తారని చెప్పారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను పరీక్షించి వాటిలో నకిలీలను గుర్తించి రైతులను అప్రమత్తం చేస్తారన్నారు. అంతేకాక భూసార పరీక్షలు చేసి, భూమిలో సూష్మపోషకాల కొరతను తెలియజేయడం జరుగుతుందని, అదే విధంగా భూమి ఏ ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాలను కూడా అగ్రి ల్యాబ్ ద్వారా రైతులు తెలుసుకోవచ్చన్నారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లతో రాష్ట్రంలో నాణ్యమైన పంటలు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందుతాయన్నారు. అంతేకాక రైతాంగం నష్టాలబారిన పడకుండా రక్షించవచ్చన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు మేలు చేసేందుకు ఒక అడుగు వేస్తే తండ్రి కంటే మిన్నగా డాక్టర్ వైయస్ జగన్ పది అడుగులు వేస్తున్నారు రైతు భరోసా కేంద్రాలను కొత్త భవనాలు కూడా ఏర్పాటు అయ్యాయి రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు పురుగుమందులు అదే అదే గ్రామంలో లభ్యమవుతున్నా యిని అన్నారు. ముఖ్యమంత్రి 16 వేల కోట్లతో రాష్ట్రంలోని పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చి దిద్దారని చెప్పారు. దీంతో పాఠశాలలో చదివే పిల్లలు తాము ప్రభుత్వ పాఠశాల విద్యార్థులమని గర్వంగా అనుభూతి చెందడం గమనార్హమన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో మెరుగుపడ్డాయిని ప్రజలకు తక్షణ వైద్యం అందించేందుకు 104 108 వాహనాలు వచ్చేయిని తెలిపారు. రాష్ట్రంలో 62 లక్షల మంది వృద్ధులు వితంతువులకు ప్రతి నెల ఒకటవ తేదీన 97% ఆయా గ్రామ , వార్డువాలంటీర్ల పంపిణీ చేస్తున్నారని, ఆ తర్వాత రోజు మూడు శాతం మందికి నగదు పంపిణీ చేస్తున్నారని మంత్రి అన్నారు. ఇది సంక్షేమ ప్రభుత్వమని మాటలు కాక చేతలు చేసే ప్రభుత్వమని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), వైస్ ఛైర్మెన్ తోట సత్యనారాయణ, మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత , డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ , మచిలీపట్నం ఎం పి డి ఓ జీ వి సూర్యనారాయణ, మచిలీపట్నం డివిజన్ ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, 2 వ డివిజన్ కార్పొరేటర్ పరింకాయల విజయచందర్, పలువురు వ్యవసాయ అధికారులు , కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *