-స్త్రీ శక్తి కి రూపం… బాలికలకు రక్షణ కలిపిద్దాం.. చదివిద్ధాం
-ఆడపిల్లల పరిరక్షణ, రక్షణ మనందరి బాధ్యత
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్తు కోసం అమ్మాయి దృష్టి సారించాలనే నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందని జిల్లాలో కలెక్టరు పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక రాజానగరం ఐ సి డి ఎస్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమానికి కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు రాజానగరం సర్పంచ్ కుందేటి ప్రసాద్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, విజయదశమి పండుగ వేళ అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం కాకతాళీయం అయినా, దసరా నవరాత్రులలో అమ్మవారిని వివిధ అవతారాల్లో పూజించుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ధైర్య లక్ష్మీ , ధన లక్ష్మి , విద్యాలక్ష్మి, , విజయ లక్ష్మి, సౌభాగ్య లక్ష్మీ, సంతాన లక్ష్మి, ధాన్య లక్ష్మి, రాజ్య లక్ష్మి గా ఎనిమిది రూపాల్లో కొలుచుకోవడం జరుగుతోందనీ అన్నారు. ఆడపిల్లల రక్షణ మనందరిపై ఉన్న సామాజిక బాధ్యత గా పేర్కొన్నారు. బాలికల హక్కులను పురుషులతో సమానంగా పరిరక్షణా చర్యలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. అందుకోసం ఈరోజు ను నిర్ణయించి అందరూ మాట్లాడుకునేలా చెయ్యడం, ఒక వేదికగా ఏర్పాటు చేసుకుని వేడుకను ఘనంగా నిర్వహిస్తునట్లు తెలియ చేశారు. ఈరోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శక్తి స్వరూపిణి గా , మన సంస్కృతికి చిహ్నంగ బాలికల ప్రదర్శన ఆక్కొట్టుకుందని అన్నారు. ధైర్యం, సాహసం, దూకుడు, శక్తి స్వరూపిణి కొలవడం జరుగుతోందని అన్నారు. శక్తికి ప్రతి రూపంగా స్త్రీని కొలవడం జరుగుతోందని, ఐతే ఆడపిల్లలు పట్ల వివక్ష ధోరణిని విడనాడాలని కలెక్టరు పిలుపు నిచ్చారు. నిర్భయంగా స్వేచ్ఛగా మన భావాలను వ్యక్తం చేసినప్పుడే సామాజిక పరంగా స్త్రీలు ముందడుగు వెయ్యడం సాధ్యం అవుతుందని కలెక్టరు ప్రశాంతి పేర్కొన్నారు. సమాజంలో స్త్రీల పట్ల, బాలికల పట్ల ఉన్న వివక్ష లేకుండా భవిష్యత్తు తరాల మహిళలకు ఇక్కడి నుంచే ప్రారంభ అడుగులు వేద్దాం అని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు జె . రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, బాలికల హక్కులను కాపాడడం కోసం, పరిరక్షణా చర్యల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలని చేప్పట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. బాలుర తో పాటుగా బాలికలకు సమాన హక్కులు ఉన్నాయని, వాటిని పరిరక్షించే విషయంలో తల్లితండ్రులు వివక్ష లేకుండా వ్యవహరించాలని సూచించారు.
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కే విజయ కుమారి మాట్లాడుతూ, ” భేటీ బచావో – భేటీ పచావో ” నినాదంతో బాలికల రక్షణ, బాలికలను చదివిద్దాం అనే విధానంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతొందన్నారు. బంగారు కొండ ప్లస్ కార్యక్రమం ద్వారా బాలిక ల, చిన్నారుల లో పౌష్టికాహార లోపం, వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు, బలహీనంగా ఉన్న వారిని సాధారణ స్ధితికి తీసుకుని వొచ్చి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
జిల్లా పాఠశాల విద్యా అధికారి కె వాసుదేవ రావు మాట్లాడుతూ, విద్యా ను ప్రతి ఒక్కరూ తప్పకుండా అభ్యసించాలని, ఆడపిల్లలే కదా నిర్లక్ష్యం వహించి స్కూలు కు పంపకపోతే అది నేరంగా పరిగణించే అవకాసం ఉన్నారు. ప్రాథమిక విద్య పిల్లల హక్కు ను పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలు ప్రదర్శించిన అష్ట లక్ష్మీ నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో రాజానగరం సర్పంచి కుందేటి ప్రసాద్, పిడి ఐ సి డి ఎస్ కే. విజయ కుమారి, డి ఈ వో కే. వాసుదేవ రావు, రాష్ట్ర మాహిళా కమీషన్ సభ్యులు జె. రాజేంద్ర ప్రసాద్, తహసిల్దార్ ఎమ్. లక్ష్మీ లావణ్య, సిడిపివో టి. నాగమణి, స్థానిక ప్రజాప్రతినిధులు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.