విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ నియోజకవర్గంలో సభ్యత్వాల్లో భాగంగా శుక్రవారం నందిగామ టౌన్ ఇంచార్జ్ కాకాని తరుణ్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ పోరు గండి నరసింహారావు మరియు అసెంబ్లీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య సభ్యత్వ నమోదు గురించి చర్చించడం జరిగినది నందిగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు వేల సభ్యత్వాలు చేయడం జరిగినది 16వ తారీకు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉన్నందువలన మండల అధ్యక్షులు మరియు సభ్యత ప్రముఖులను ఈ ఐదు రోజులలో మరొక మూడు వేలు చేయవలసిందిగా కాకాని తరుణ్ చెప్పినారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుత్తా బాలకృష్ణ, గంటా వెంకట్రావు మొక్కపాటి నరసింహారావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సాంబశివరావు, మార్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రా వూరి రమేష్, గోనెల సత్యనారాయణ, కట్టుకూరి సుందరావు, కంచికచర్ల ఇన్చార్జి రమాదేవి, రమణ, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం, నందిగామ లో కాకాని వెంకటరత్నం డిగ్రీ కాలేజ్ , అలాగే ఆయన పేరు మీద కాకాని నగర్ ఉండటం వంటివన్నీ కాకాని తరుణ్ నెమరువేసుకున్నారు. ఈ ప్రాంతం తో ఆయన కుటుంబానికి ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
అనంతరం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తి తో నందిగామ టౌన్ సభ్యత్వ ఇంచార్జి డాక్టర్ తరుణ్ కాకాని ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సన్మానం జరిపి దసరా శుభాకాంక్షలు తెలిపి వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …