ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాల సందర్భంగా శనివారం విజయ దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో, భవానీ మాలధారులతో ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది. జై భవాని, జై జై భవాని.. జై దుర్గా, జై జై దుర్గా జయజయధ్వానాలతో హోరెత్తింది. ఆధ్యాత్మిక పరిమళాలతో సుగంధ భరితమైంది. శరన్నవరాత్రుల కార్యక్రమాల ముగింపు రోజు శాస్త్రోక్తంగా నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. విజయదశమి కావడంతో సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారులు కూడా పెద్ద సంఖ్యలో జగన్మాతను దర్శించుకున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో వేద పండితులు దసరా పండగ విశిష్టతను, జగన్మాత నవదుర్గ అవతారాల వెనుక ఉన్న పురాణ విశిష్టతను వివరించారు.
Tags indrakiladri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …