Breaking News

విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయదశమి పర్వదినం పురస్కరించుకుని తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమటలంక మరియు 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు నిర్వహించిన దసరా ఉత్సవాలలో ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు .ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజలందరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకొంటూన్నట్టు తెలిపారు. తెలుగు ప్రజాలందరికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తొమ్మిది రోజులుగా ఎంతో పవిత్రంగా అమ్మవారిని పూజించుకొన్న భక్తులు శాంతిసౌఖ్యలతో పండుగ జరుపుకోవాలని అవినాష్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు ఈశ్వర ప్రసాద్,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు,మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు, క్లస్టర్ ఇంచార్జ్ గద్దె కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *