Breaking News

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దసరా పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల దుష్టపాలనను ఏపీ ప్రజలు తరిమి తరిమి కొట్టారని, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ పట్టం కట్టారని అన్నారు. సైకో పాలకులను ప్రజా మద్దతుతో తరిమికొట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధి లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పెట్టుబడుల వరద వస్తున్నదని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ముంపుతో విజయవాడ ప్రాంతం తీవ్ర విపత్తును ఎదుర్కొన్నప్పటికీ, ప్రజలందరూ ప్రభుత్వానికి చేయూతను అందించడంతో విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వం సఫలీకృతం అయిందని అన్నారు.చెడుపై మంచి మరియు దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి అని ఆయన పేర్కొన్నారు .దసరా పండుగ ప్రజలందరికీ మేలు చేయాలని, సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దసరా పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *