అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ప్రతిష్టతను ఆకాశంలో నిలబెట్టేలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత రక్షణ రంగం బలోపేతానికి విశేష కృషి చేసిన మీసైల్ మ్యాన్, మేధావి, నిరాడంబరుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు నేతలు ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అయన సేవలను కొనియాడారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్పశాస్త్రవేత్త. యువతకు మార్గదర్శి. జీవితాంతం దేశ ప్రతిష్టకోసం తపించిన దేశభక్తుడని ప్రశంశించారు. అందరూ కలాంను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆధునిక యుగంలో భారతదేశం ముందుండేలా కొత్తకొత్త ఆవిష్కరణలతో యువత అడుగులు వేసి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేతలు: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థన్, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, టీఎన్టీయూసీ నాయకులు గొట్టుముక్కల రఘురామరాజు, సత్యవాణి, పర్చూరి కృష్ణ, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు తదితర నేతలు పాల్గొని కలాంకు ఘన నివాళులు అర్పించారు
Tags amaravathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …