-వరద సంబంధిత ఫిర్యాదుల కొరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ 24×7 అందుబాటులో ఉంచండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద హెచ్చరికల కారణంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రజలు తమ ఫిర్యాదులను అంద చేయవచ్చని, లోతట్టు ప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు తరలిరావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రివర్ కన్సర్వేటర్ కృష్ణ సెంట్రల్ డివిజన్ విజయవాడ వారి సమాచారం మేరకు ప్రకాశం బ్యారేజ్ లో ప్రస్తుతం నీటిమట్టం 57,500 క్యూ సెక్లూ ఉండగా, పులిచింతల ప్రాజెక్టు డ్యాం నీటిమట్టం లక్ష క్యూసెక్కులకు పెరగగా, అందుకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజ్ నీటిమట్టం కూడా శనివారంకి లక్ష క్యూసెక్కులకు పెరిగే అవకాశాలు ఉన్నందున కృష్ణానది పర్వాహిక ప్రాంతాలు లో నివసిస్తున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు
ఈ సందర్భంగా శాఖధిపతులతో మాట్లాడుతూ వరద హెచ్చరిక సంబంధించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతిక్షణం అప్రమత్తంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. వరదల సంబంధించి ప్రజలు ఎటువంటి సాయం కావాలన్నా, ఫిర్యాదులు ఉన్న 8181960909 నంబర్కు వాట్స్అప్ ద్వారా తెలుపవచ్చని, 0866-2427485, 0866-2424172 నంబర్లకు కాల్ చేయవచ్చని కమిషనర్ తెలిపారు