Breaking News

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించండి

-కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీని కలిసిన తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి నేడు ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీ శైలేష్ కుమార్ సింగ్ ని కలిశారు. ఆమోదించబడిన ప్రాజెక్ట్‌లను సకాలంలో అమలు చేయడం తోపాటుగా చర్చల సమయంలో లేవనెత్తిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో దిశా సమావేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఎంపీ డా గురుమూర్తి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు మరియు జీవనోపాధి వంటి రంగాలలో సవాళ్లను ఎదుర్కోవటానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని అందువల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశ సమావేశాలను వీలైనంత త్వరగా నిర్వహించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *