Breaking News

స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ ల నుండి రుణాలు అందేలా చిత్తశుద్దితో కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మెప్మా రీసోర్స్ పర్సన్స్ (ఆర్.పి.) ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా అర్హులైన స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ ల నుండి రుణాలు అందేలా చిత్తశుద్దితో కృషి చేయాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ నసీర్ అహ్మద్  స్పష్టం చేశారు. శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆర్.పి.లు, సిఎంఎంలు, సిఓలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ తొలుత నియోజకవర్గ పరిధిలో ఎంత మంది స్వయం సహాయక గ్రూప్ లు, సభ్యులు, ఇప్పటి వరకు అందిన రుణాలు, రీ పేమెంట్, అందించిన బ్యాంక్ లు, మెప్మా సిబ్బంది తదితర వివరాలు అదిగి తెలుసుకొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక గ్రూప్ సభ్యుల ఉన్నతిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. సభ్యులకు అందాల్సిన రుణాలను బ్యాంకర్ల ద్వారా ఇప్పించడంలో ఆర్.పి.లు కీలకంగా ఉన్నారన్నారు. ఆర్.పి.లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా రుణాలు మంజూరు చేయించాలని, ఎక్కడ అవినీతి జరిగినా సహించబోమని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని మెప్మాకి సంబందించిన సమగ్ర వివరాలను డాక్యుమెంట్ గా త్వరగా అందించాలన్నారు. సమావేశంలో మెప్మా పిడి (ఎఫ్ఏసి) విజయలక్ష్మీ, జిఎంసి డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, ఎల్.డి.ఎం. రత్నమహిపాల్ రెడ్డి, ఉపా సెల్ పిఓ బాలాజీ బాష, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *