-ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం మరియు అవగాహనపై అవార్డులు
-ప్రతి కేటగిరీలో ఒకటి వంతున నాలుగు కేటగిరీల్లో అవార్డులు
-ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా(టెలివిజన్)
-ఎలక్ట్రానిక్ మీడియా(రెడియో),ఆన్లైన్(ఇంటర్నెట్,సోషల్)మీడియా
-ఎంట్రీలను వచ్చే డిశంబరు 10వతేదీ లోగా భారత ఎన్నికల సంఘానికి పంపాలి
-2025 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ఓటర్ల చైతన్యం మరియు అవగాహన ప్రచారంలో ఉత్తమంగా కృషి చేసిన మీడియా సంస్థలకు-2024 పేరిట భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రదానం చేసేందుకు వివిధ మీడియా సంస్థల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా(టెలివిజన్),ఎలక్ట్రానిక్ మీడియా (రేడియో),ఆన్లైన్(ఇంటర్నెట్,సోషల్)మీడియా రంగాల్లో ఓటర్లలో చైతన్యం మరియు అవగాహన పెంపొందించేందుకు ఉత్తమ కృషి చేసిన వారికి రంగానికి ఒక అవార్డు వంతున భారత ఎన్నికల సంఘం 2012 నుండి ప్రతి యేటా అవార్డులు అందిస్తోందని తెలిపారు.2024 ఏడాదికి సంబంధించి వచ్చే ఏడాది జనవరి 25వ తేది జాతీయ ఓటరు దినోత్సవం రోజున ఈ అవార్డులను ప్రధానం చేయనుందని ఆయన తెలియజేశారు.అవార్డు కింద ప్రశంసా పత్రం (Citation)తో పాటు జ్ణాపిక(Plaque) ప్రధానం చేయనున్నారని సిఇఓ పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పెద్దఎత్తున భాగస్వాములను చేసేందుకు వారిలో ఓటుహక్కు వినియోగంపై చైతన్యం కలిగించడం,ఓటరుగా నమోదు,రిజిస్ట్రేషన్ వంటి అంశాలతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఐటి అప్లికేషన్లు,యూనిక్ మరియు రిమోట్ పోలింగ్ కేంద్రాలు వంటి వాటిపై ప్రత్యేక కధనాలు ప్రచురణ,ప్రసారం చేయడం ద్వారా ఓటర్ల అవగాహనకు విశేష కృషి చేసిన మీడియా సంస్థలకు భారత ఎన్నికల సంఘం ఈఅవార్డులను ప్రదానం చేయనుందని సిఇఓ వివేక్ యాదవ్ తెలిపారు.ప్రత్యేక జ్యూరీ ఆధ్వర్యంలో క్వాలిటీ ఆఫ్ ఓటరు అవేర్నెస్ క్యాంపెయిన్,ఎన్నికలకు సంబంధించిన ఖచ్ఛితమైన,సమతుల (balanced) సమాచారాన్నిఓటర్లకు అందించడం,స్పెషల్ షోలు,చర్చలు,నిపుణులతో కూడిన చర్చలు నిర్వహణ,ఎక్స్టంట్ ఆఫ్ కవరేజ్,క్వాంటిటీని ఈజ్యూరీ అంచనా వేస్తుందని తెలిపారు.అంతేగాక ఓటరు అవగాహన కార్యక్రమాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల నిర్వహణకు తీసుకున్నచొరవ వంటి అంశాలపై ప్రచురితమైన,ప్రసారం చేసిన కధనాలను పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు.అలాగే ఎన్నికలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని హైలెట్ చేసి ప్రచురణ,ప్రసారం చేసిన అంశాల ఆధారాలను జ్యూరీ పరిశీలించి ఉత్తమ ఎంట్రీలను అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుందని సిఇఓ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.
ఎంట్రీలకు సంబంధించి 2024 ఏడాదిలో ప్రింట్ మీడియా న్యూస్ ఐటమ్స్,ఆర్టికల్స్ ప్రచురితమైన కాలం సెంటీమీటర్లు వివరాలను సాప్ట్ కాఫీ పిడిఎఫ్ లేదా న్యూస్ పేపర్,ఆర్టికల్స్ పుల్ సైజ్ పొటోకాఫీ,ప్రింట్ కాఫీ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని సిఇఓ వివేక్ యాదవ్ తెలియ జేశారు.అలాగే డైరెక్ట్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన మరే ఇతర సమాచారా న్నైనా పంపవచ్చన్నారు.అదే విధంగా బ్రాడ్ కాస్ట్ టెలివిజన్(ఎలక్ట్రానిక్) మరియు రేడియో (ఎలక్ట్రానిక్) ఎంట్రీలకు సంబంధించి క్యాంపెయిన్,వర్కు సంక్షిప్త సమాచారం సిడి లేదా డివిడి లేదా పెన్ డ్రైవ్ ద్వారా బ్రాడ్ కాస్ట్,టెలికాస్ట్ అయిన వివరాలు సమర్పించాల్సి ఉంటుందని తెలియజేశారు.ప్రసారమైన అన్నిస్పాట్లు,న్యూస్ వివరాలను,ఓటరు అవగాహనకు సంబంధించిన న్యూస్ ఫీచర్లు లేదా ప్రోగ్రామ్ లకు సంబంధించిన సిడి లేదా డివిడి లేక పెన్ డ్రైవ్ రూపంలో టెలికాస్ట్,బ్రాడ్ కాస్ట్ అయిన వ్యవధి,తేదీ,సమయం మరియు ప్రీక్వెన్సీ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని సిఇఓ తెలియజేశారు.
ఆన్లైన్(ఇంటర్నెట్,సోషల్) మీడియా ఎంట్రీలు పంపేవారు విధిగా ఓటరు అవగాహనకు సంబంధించిన ఆనిర్దేశిత సమయంలో చేసిన పోస్టులు,బ్లాగ్స్,క్యాంపెయిన్లు,ట్వీట్లు,ఆర్టికల్స్ వంటి వాటి వివరాలను పిడిఎఫ్ సాప్ట్ కాఫీ లేదా సంబంధిత వెబ్ లింక్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.అలాగే పబ్లిక్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఇతర కార్యక్రమాలు,ఇంపాక్ట్ ఆఫ్ ఆన్లైన్ యాక్టివిటీ వివరాలను ఆయా ఎంట్రీలతో కలిపి సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఓటర్ల చైతన్యం,అవగాహనపై మీడియా అవార్డ్సు-2024కు ఎంట్రీలు పంపేవారు ఆంగ్లం,హిందీ మినహా మిగతా భాషలకు సంబంధించినవి ఆంగ్లం ట్రాన్సులేషన్ తో కలిపి పంపాల్సి ఉంటుందని భారత ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేసిందని సిఇఓ వివేక్ యాదవ్ తెలిపారు.ఉత్తమ ఎంట్రీల ఎంపికలో ఎన్నికల కమీషన్ దే తుది నిర్ణయమని ఎంట్రీ దారులతో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలను చేయబోదని ఎన్నికల కమీషన్ తన లేఖలో స్పష్టం చేసిందన్నారు.ఎంట్రీలకి సంబంధించి విధిగా మీడియా హౌస్ యొక్క పేరు,అడ్రస్,టెలిఫోన్ నంబరు,ఫ్యాక్స్ నంబర్లు మరియు ఇ-మెయిల్ అడ్రస్ స్పష్టంగా వ్రాసి పంపాల్సి ఉంటుందని తెలిపారు.ఎంట్రీలను వచ్చే డిశంబరు 10వ తేదీ లోగా ఈక్రింది అడ్రస్ కు పంపాల్సి ఉంటుందని తెలియజేశారు.
ఎంట్రీలు పంపాల్సిన చిరునామా:
రాజేశ్ కుమార్ సింగ్,అండర్ సెక్రటరీ (కమ్యునికేషన్),
ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్,
అశోకా రోడ్డు, న్యూఢిల్లీ 110001.
ఇ.మెయిల్:media-division@eci.gov.in.
ఫోన్ నంబరు: 011-23052131.