Breaking News

పరిశ్రమల అవసరాల మేరకు మానవ వనరుల మ్యాపింగ్ ద్వారా జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటిఐ కాలేజీలలో, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో కోర్సు పూర్తి చేసుకుంటున్న వారికి వారి ప్రాంతాలకు దగ్గరలోని పరిశ్రమలను గుర్తించి వాటికి అవసరమైన మానవ వనరులను అందించేలా యువతకు ఉపాధి కల్పించేలా ఉండాలని, సదరు మ్యాపింగ్ పక్కాగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, మెప్మ , డిఆర్డిఎ, పాలిటెక్నిక్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ తదితర అధికారులతో జెసి శుభం బన్సల్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా నైపుణ్యం పొందిన వారికి, ఐటిఐ, పాలిటెక్నిక్ ల ద్వారా కోర్సులు పూర్తి చేసుకున్న యువతకు వాటి సమీపంలోని పరిశ్రమలలో మానవ వనరులు, సాంకేతిక నిపుణుల అవసరతను గుర్తించి ఆ మేరకు కోర్సులలో శిక్షణ పొందిన వారికి సదరు పరిశ్రమలలో ఉపాధి కల్పించే విధంగా మ్యాపింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. అందుకొరకు ఒక కమిటీ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసేలా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కన్వీనర్ గా, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి కో-కన్వీనర్ గా, పథక సంచాలకులు డిఆర్డిఎ,మెప్మా, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, ఎల్డిఎం, జడ్.ఎం ఏపీఐఐసి, సహాయ సంచాలకులు హ్యాండ్ లూమ్స్, కన్వీనర్ పాలిటెక్నిక్, ఐటిఐ తదితరులు సభ్యులుగా కమిటీ ఏర్పాటుతో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలోని పరిశ్రమలకు అవసరమయ్యే మానవ వనరులను గుర్తించి వాటిని మ్యాపింగ్ చేసి, సంబంధిత కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి వారికి సదరు పరిశ్రమలలో ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. అందుకొరకు ఇప్పుడు ఏర్పాటు చేయనున్న కమిటీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ఇంఛార్జి అధికారి, పథక సంచాలకులు డిఆర్డిఎ శోభన్ బాబు, మెప్మా రాధమ్మ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *