-పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు
-“పదిహేనేళ్ల క్రితమే బెహెన్జీ కుమారి మాయావతి దీనికి మద్దత్తు పలికారు, కమిటీలంటూ మోసం చేస్తున్నది కాంగ్రెస్, బీజేపీలే”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనాదిగా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాల్లో కలపడానికి జరుగుతున్నా పోరాటాలను ప్రభుత్వాలన్నీ కమిటీలు, కమిషన్ల పేరుతొ నిర్వీర్యం చేస్తున్నాయని, మునుపటిలాగానే ఈ ఉద్యమానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూనే ఉంటుందని రిటైర్డ్ డీజీపీ మరియు బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు చెప్పారు. బుధవారం, విజయవాడలో క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో, దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలనే డిమాండ్ పై జరిగిన రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో అయన ప్రసంగిస్తూ బీఎస్పీ దీనిపై మున్ముందు ఉద్యమాలకు, ప్రజాపోరాటాలకు ఉద్యుక్తులవుతుందని చెప్పారు.
“నాడు అంబెడ్కర్ పుణ్యమాని ఎస్సీ, ఎస్టీలకు రేజర్వేషన్ల కల్పన జరిగింది. కానీ, శతాబ్దాలుగా అవమానాలకు, నిర్లక్ష్యానికి కులమనే వెలికి బలైన దళితులు క్రైస్తవులుగా మారినా వారికి జరుగుతున్న మంచి ఏమీ లేదు. అటు మతం అనేక విధాలుగా కులవివక్షకు గురవుతూనే వస్తూ కులమనే ముద్ర నుండి బయటపడలేని వీరికి ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్లు కల్పించబోము అంటూ మోసం చేయడం వలన వీరి బతుకులు మరింత దుర్భరంగా మారాయి. దశాబ్దాలుగా వస్తున్నా ఈ డిమాండ్ పై కమిటీలు ఇక పనిచేయబోవు. ఇక పోరాటాలే మార్గం. అయినా కూడా బీఎస్పీ సంయమనం పాటిస్తూ రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోయే బాలకృష్ణన్ కమిషన్ ముందర మా వైఖరి స్పష్టం చేస్తాము.”
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ సామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ… “చరిత్రలో చుస్తే కనుక దళితులు క్రైస్తువుల్లా మారినా కూడా వారికీ ఎన్నో విధాలుగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయ్. అగ్ర కులాల నుండి వచ్చిన ఆర్చిబిషప్ల నుండి పాస్టర్ల వరకు దళితులను అంటరానివారిగా చూస్తున్న ఉన్నారు. మరిక్కడ కూడా కుల వివక్ష ఎదురొకుంటుంటే కులాన్ని మా మీద రుద్దుతున్నది ఎవరు అని ప్రశ్నించారు. అందుకే మేము ఢిల్లీ వరకు వెళ్లి మా మనుగడ, బాగుకోసం ఏసీ స్టేటస్ డిమాండ్ చేసాము. ఈ సర్కారు నుండి మాకు ఎటువంటి ఆశ లేకపోయినా మేము పోరాడుతూనే ఉంటాము, మా పోరాటానికి మద్దత్తు తెలిపిన బీఎస్పీ ధన్యవాదాలు.”
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి మాట్లాడుతూ… దళిత క్రైస్తవుల ఆవేదన బీఎస్పీ పూర్తిగా అర్థం చేసుకున్నాడని, వారికీ మరింత బలంగా మద్దత్తు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కె. బాబురావు ఐపీఎస్, అడిషనల్ డీజీ, రెవ డా దయాపాత్ర (ఎఐసీసీ ప్రెసిడెంట్, తమిళనాడు), డా తెన్నేటి జయరాజు (ప్రముఖ రచయిత), కె. శాంతి సాగర్ బిషప్ (ఇండిపెండెంట్), రెవ కరణం తిరుపతిరావు (హైకోర్ట్ అడ్వకేట్), బొక్కా జార్జిముల్లర్ (నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు), మరియు రాష్ట్రం నలుమూలల నుండీ వచ్చిన పాస్టర్లు, మతగురువులు పాల్గొన్నారు.