Breaking News

పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణం…

-ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ప్రాజెక్ట్‌ సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న ప్రదేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ముక్త్యాల గ్రామం నుండి గుంటూరు జిల్లా మాదిపాడు గ్రామానికి కృష్ణానది మీదగా పడవ పై ప్రయాణించి పులిచింతల ప్రాజెక్టు కు చేరుకున్నారు. అక్కడ కూడా తెలంగాణ పోలీసులు డ్యామ్ మీదకు రావడానికి అనుమతులు లేవని మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలవకుండా తెలంగాణ ప్రభుత్వం అక్రమ విద్యుదుత్పత్తి వల్ల నీరు వృథా అవుతోందన్నారు. విభజన హామీలను తెలంగాణ తుంగలో తొక్కుతోందని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చిన మమ్మల్ని తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ఇదేవిధంగా కొనసాగిస్తే సహించేది లేదని, తెలంగాణ మంత్రులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బచావత్ ట్రిబ్యునల్‌ చెప్పిన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకోవాలని అన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *