కిడ్నీ రీసర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం కావాలి…

-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్దాన ప్రాంత కిడ్నీ రోగులకు పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కార్ ను కోరారు. ఆదివారం జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి డాక్టర్ అప్పలరాజు ఉద్దానం రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి , కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారని తెలిపారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేసి ప్రజా ఆరోగ్యానికి అంకితం చేయాలని చూశామని కానీ కరోనా రావడం వలన పనులు అన్ని ఆగిపోయాయని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఆగిపోయిన పనులు మల్లి నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చొరవ చూపించాలని కలెక్టర్ కి కోరారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పనుల నిర్మాణ దశ ను పూర్తిగా అధికారులకు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగనన్న పలాసలో నిర్మించనున్న కిడ్నీ ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని అదనంగా 50 కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేశారు. వాస్తవానికి ఆసుపత్రి నిర్మాణానికి మొదటిగా 50 కోట్ల రూపాయలతో ప్రణాళిక వేసున్న ప్రభుత్వం కోవిడ్ కారణంగా పనులు జరగకపోవడంతో ఆసుపత్రి నిర్మాణ వ్యయాన్ని పెంచి పనులు వేగవంతం చేసేలా చూస్తోంది. మంత్రి డాక్డర్ సీదిరి అప్పలరాజు ఆద్వర్యంలో కలెక్టర్ తోకూడిన అధికార బృందం సందర్శించింది. అలాగే పలాస ప్రభుత్వ ఆసుపత్రి లో 50 లక్షల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న ఆసుపత్రి ఆధునీకరణ పనులు, అధనపు బిల్డింగులు నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని కోరారు. అంతే కాకుండా కాశీబుగ్గ అక్కుపల్లి రహదారి పనులకు 30 కోట్లు రూపాయలు మంజూరు అయిన విషయం తిసిందే కాశీబుగ్గ పాత పెట్రోల్ బంకు దగ్గర నుండి అక్కుపల్లి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. ఆ ప్రాంత నాయకులతో మాట్లాడారు. కరోనా కారణంగా పెండింగులో ఉన్న పనులన్ని పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిగా దృష్టి సారిస్తామని కలెక్టర్ మంత్రికి హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు ఎంతో నమ్మకం అని ఆయన పలాస ప్రాంతం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని వాటిని ప్రజలకు అందించేలా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఒ, పలాస ఎమ్మార్వో, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, మున్సిపల్ కమీషనర్ టి.రాజేంద్రప్రసాద్. లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *