గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ గోశాలలో ఆవులకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం వెంగళాయపాలెంలోని జిఎంసి గోశాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రోడ్ల మీద ట్రాఫిక్ కు అంతరాయం కల్గించే ఆవులు, ఎద్దులు, పశువులను గోశాలకు తరలిస్తున్నామన్నారు. గోశాలలో ఆవులను శుభ్రం చేయడానికి, నీరు బయటకు వెళ్లడానికి వీలుగా ప్లాట్ ఫారం, అదనపు షెడ్ ని ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మేతకి వినియోగించే గడ్డి తడవకుండా కూడా షెడ్ వేయాలన్నారు. ఆవుల సంరక్షణకు కేటాయించిన సిబ్బంది వివరాలను తమకు అందించాలని, ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గోశాలకు తరలించిన ఆవులను సదరు యజమానులు కావాలని అడిగినప్పుడు, వారికి అప్పగించడానికి నిర్దేశిత ఫైన్, డాక్యుమెంటేషన్ సిద్దం చేయాలన్నారు. పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ కళ్యాణ రావు, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, ఆనందకుమార్, టిపిఎస్ లక్ష్మణ స్వామి, ఏఈ రవి కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …