Breaking News

రవాణా అధికార్లు యూనిఫామ్ లేకుండా రోడ్డు పై కనబడితే కఠిన చర్యలు తప్పవు మంత్రి వెల్లడి.

-కడప ఆర్టీవో కార్యాలయంలోని బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయ భాస్కర్ రాజు పై తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని మంత్రి హితవు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారై ఉండి అక్రమ వసూళ్లు పాల్పడటం హ్యేయమని, అధికారిని ప్రశ్నించడం పట్ల డ్రైవర్ల ఆవేదన అర్ధమవుతుందని, కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్ రాజు అక్రమ డ్రైవర్లు వద్ద వసూళ్లకు పాల్పడుతూ ఉన్న వీడియో వైరల్ కావడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ఇటు వంటి అధికారుల పట్ల తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని , భవిష్యత్ లో మరో అధికారి ఇలాంటి చర్యలకు తావు ఇవ్వకుండా చర్యలు ఉంటాయని, రవాణా అధికార్లు యూనిఫామ్ లేకుండా రోడ్డు పై కనబడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి వెల్లడి చేసారు. రవాణా అధికారులు శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచన చేశారు. జరిగే ఘటనపై మంత్రి అరా తీశారు. తదుపరి చర్యల నిమిత్తం నియమాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Check Also

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం

-నాకు అధికారం, సీఎం కుర్చీ కొత్తకాదు… ప్రజలు నమ్మకంతో గెలిపించారు -వాట్సాప్ ద్వారా త్వరలో 150 సేవలు అందుబాటులోకి -వాట్సాప్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *