అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకు సజ్జా రోహిత్ అనే దాత రూ. 1 కోటి విరాళం అందజేశారు. సచివాలయంలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి విరాళానికి సంబంధించి చెక్కును అందజేశారు. అలాగే కపిలేశ్వరపురం మాతృభూమి శ్రేయోసంఘం ప్రతినిధి కె. రామ్మోహనరావు కూడా అన్న క్యాంటీన్లకు రూ.5,41,116 చెక్కును అందజేశారు. ఎస్.కె. యూనివర్సిటీ సిబ్బంది తరఫున ఆచార్య జి.వెంకట నాయుడు రూ.17,34,786, కుప్పం నియోజకవర్గం నుండి సేకరించిన రూ.14,36,000 విరాళాన్ని మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు వరదబాధితుల సహాయర్థం ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
Tags amaravathi
Check Also
స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …
Prajavartha Online Telugu News