Breaking News

48వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండ ప్రాంతమైన 48వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు. 48వ డివిజన్ లోని రోడ్లు, డ్రెయిన్లు, సైడ్ కాల్వలు, కొండ ప్రాంతంలోని మెట్లు, అలాగే రిటైనింగ్ వాల్ నిర్మాణం , బూస్టర్ రూములను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పెండింగ్ పనులను పూర్తి చేస్తూ పశ్చిమ లోని సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ఎమ్మెల్యే సుజనా టెండర్ల ప్రక్రియ ప్రారంభించారన్నారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసేలా సుజనా చౌదరి కృషి చేస్తున్నారని తెలిపారు. జనసేన నేతలు దిండి నాని, వి నాగరాజు కూటమి నేతలు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *