-నిధుల విడుదల గురించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ కి తెలిపిన రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి
-అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
-రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన నిధులు విడుదల చేయించి నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి కందుల దుర్గేష్
-రాష్ట్రంలోని నిడదవోలును అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న మంత్రి కందుల దుర్గేష్
-మంత్రి దుర్గేష్ చొరవతో నిధులు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్న నిడదవోలు నియోజకవర్గం ప్రజలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు నియోజకవర్గంలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 4 పనులకు రూ. 261 లక్షలు మంజూరు చేయడం జరిగిందని రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి తెలిపినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్స్ మరియు అత్యవసర మరమ్మత్తుల కోసం సంబంధిత నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు..ఈ సందర్భంగా టెండర్లు త్వరితగతిన పూర్తి చేయడానికి నిడదవోలు ప్రాంతంలోని ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించినట్లు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.. త్వరలోనే పనులు మొదలు పెట్టనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటనలో తెలిపారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు బీసి జనార్దన్ రెడ్డికి మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన నిధులు విడుదల చేయించి నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి కందుల దుర్గేష్ పాటుపడుతున్నారు. రాష్ట్రంలోని నిడదవోలును అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మంత్రి దుర్గేష్ ముందుకు వెళ్తున్నారు. మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నియోజకవర్గానికి త్వరితగతిన నిధులు మంజూరు కావడంపై స్థానిక నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.