విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏస్పా భారత్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే ముగింపు ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపటి ప్రపంచ ఆరోగ్యం ఆనందం ఆక్యుపంక్చర్ సైన్స్ తోనే సాధ్యమని ఎస్పా భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మా కాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆక్యుపంక్చర్ ను ప్రతిభావంతమైన వైద్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది, యునెస్కో దీనిని విడదీయలేని అతి పురాతన మానవతతో కూడినది అని పేర్కొంది.
భారతదేశం ఆక్యుపంక్చర్ వైద్యాన్ని ప్రత్యేక విభాగ చికిత్సగ గుర్తించింది. ఎస్పా భారత్ 2024 ఉత్సవాలను గత నెల 24వ తేదీ నుండి దేశ నలుమూలల ఆక్యుపంక్చర్ శిక్షణ కార్యక్రమాలను జరిపిస్తున్నట్లు పేర్కొన్నారు. మూల చికిత్స జరిగేటట్లు మనలోని ప్రత్యేకమైన పాయింట్స్ ను రకరకాల పద్ధతులలో ప్రేరేపించి వ్యాధులు నయం అయ్యేలాగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సర్జరీలను సైతం నివారించే లాగ ప్రత్యేకతను సంతరించుకున్నట్లు వివరించారు. ప్రతి హాస్పటల్ ఆక్యుపంక్చర్ సౌకర్యం ఏర్పాటు చేయవలసినదిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సంస్థ కోరుచున్నది. అమెరికాలో సైతం ఆక్యుపంక్చర్ వృద్ధి జరుగుతూ ఉంటే భారతదేశంలో వృద్ధికి ప్రభుత్వం కృషి చేయవలసినదిగా సంస్థనివేదిస్తున్నది. ఆక్యుపంక్చర్ సైన్సు వ్యాప్తి కోసం పనిచేస్తున్న వారిని కార్యవర్గములోకి తీసుకొంటూ పత్రాలు అందజేయబడినది.
వరల్డ్ అక్యుపంచర్ దినోత్సవం ముగింపు కార్యక్రమానికి కాకినాడ ఏస్పా భారత్ సలహాదారులు ఎన్ వి ఎస్ మూర్తి, ప్రముఖ ఆయుర్వేద సర్జన్ డాక్టర్ దీవి రామకృష్ణ, ఏపీ ట్రాన్స్కో సూపర్డెంట్ ఇంజనీరు రాజారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మూర్తి మాట్లాడుతూ మనలోని ప్రాణ శక్తి ప్రేరేపిస్తే ఆరోగ్యoవస్తుందని చెప్పారు. డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతు ఆయుర్వేదం లోని మర్మ లాగ ఆక్యుపంక్చర్ ఉంటుందని చెప్పారు. ట్రాన్స్కో ఇంజనీర్ రాజారావు మంచి ఆరోగ్య విధానం అని ఏంచి సహకారం అందించుచున్నట్లు చెప్పారు. ఏస్పా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అలవాల రవి కార్యవర్గ సభ్యులు వంగర రేణుకా దేవి, శేషు కుమారి, జోగిరాజు,, ముంజుపల్లి శివకుమార్, భూతపాటి ఉదయకుమార్, వగైరా అనేక రాష్ట్రాల వారు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News