Breaking News

మన మరుగుదొడ్లు … మన గౌరవం

-మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో అవగాహన పెంచాలి
-ప్రపంచ  మరుగుదొడ్ల  దినోత్సవం పారిశుద్ధ్య కార్మికులు సన్మానం
-కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
‘శాంతి కోసం ఒక ప్రదేశం’ అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలక్టరేట్ లో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ చైర్ పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా గ్రామీణ  నీటి సరఫరా   మరియు పారిశుధ్య విభాగం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని గ్రామీణ, పట్టణ ప్రాంతాలను యందు పారిశుధ్య నిర్వహణా వ్యవస్థ ను మెరుగు పరుచుకోవాలన్నారు. డి ఆర్ డి ఎ ద్వారా మహిళల , ప్రజల భాగస్వామ్యం చేసి మరుగుదొడ్ల వినియోగం పెంచాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణా సామర్ధ్యం పెంచడం ద్వారా గ్రామ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించుటకు కృషి చేయాలి అన్నారు. గ్రామ పంచాయతీలు నిరంతరం పారిశుధ్య నిర్వహణా వ్యవస్థ మెరుగు పరుచుకోవటానికి పారిశుధ్య కార్మికులను ప్రోత్సహించాలన్నారు. సమాజ హితం కోరే వ్యక్తులుగా సమాజంలో అత్యంత గౌరవ వ్యక్తులు శానిటరీ సిబ్బంది అని కలెక్టరు పేర్కొన్నారు. తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించిన అవకాశం కలుగుతుందన్నారు..కమిటీ హెల్త్ సెంటర్స్, అంగన్వాడి సెంటర్స్, గ్రామాల్లో ఉన్న కమ్యూనిటీ టాయిలెట్స్ ని కూడా మెరుగుపరిచే విధంగా తగిన ప్రణాళిక చేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. పాఠశాల, అంగన్వాడి, మరియు ప్రభుత్వ ఆసుపత్రి వారికి టాయిలెట్ నిర్వహణలో పోటీలు నిర్వహించాలన్నారు. ముందు వరుసలోనే ఉండి మెరుగైన ఫలితాలు సాధించిన వారికి ప్రథమ ద్వితీయ మరియు తృతీయ వర్గాలుగా వర్గీకరించి మొదటి స్థానంలో నిలిచిన వారికి 10 వేల రూపాయల నగదు పురస్కారం అందించాలని సూచించారు. మరుగుదొడ్ల పై అవగాహన శిబిరాలని జిల్లాలో వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఇతర శాఖల సమన్వయంతో డిసెంబర్ 10 వరకు కొనసాగించాలన్నారు. ప్రజల్లో పారిశుధ్యం మరియు మరుగుదొడ్లు వినియోగంపై లోతైన అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.

జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యశాఖ, కార్య నిర్వహణ అధికారి మరియు సెక్రెటరీ బి.వెంకట గిరి గారు మాట్లాడుతూ సామాజిక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్న వాటిని గుర్తించి వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే చురుకైన పాత్ర పోషిస్తున్న ఆరుగురు సభ్యులకు జిల్లా కలెక్టర్ గారి చేతులు చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. గంజే వీరమ్మ, నల్లేపు సింహాచలం , పేరంపాలి వీరాస్వామి, ఏ . బేబి , మేరీ, విజయ లని జిల్లాలోని అన్ని విభాగాల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా సన్మనిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బి వి గిరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వర్ రావు, డిఆర్డిఏ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి, ఇన్చార్జి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎమ్ . నాగలత , జిల్లా విద్యాశాఖ అధికారి కే. వాసుదేవరావు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి వై శ్రీనివాస్, ఎంపిడిఓ డి శ్రీనివాస్ రావు, ఐసిడిఎస్ పిడి , జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ, ఇతర అధికారులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *