అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా, మగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు, రేవతి ఎన్‌క్లేవ్ అధినేత పడవల మహేష్. పార్టనర్ యేచూరి రవి ఆధ్వర్యంలో అపార్టుమెంట్ నిర్మాణానికి బుధవారం ఉదయం భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డైరెక్టర్ తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పడవల మహేష్, యేచూరి రవిలకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం రేవతి ఎన్‌క్లేవ్ తరఫున నిర్మాణాలకు సంబంధించి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య, పోతిన శ్రీనివాసరావు, తమ్మశెట్టి జానకీదేవిలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అమరావతి పరిసర ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుందన్నారు. అమరావతి రైల్వేస్టేషన్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం ప్రకటన తరువాత ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం తదితర ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయని తెలిపారు. 60 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని అనుమతులతో ఇప్పటివరకు బంగారం వ్యాపారంలో రాణిస్తున్న పడవల మహేష్ స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించడం అభినందనీయం అన్నారు. రాజధాని అమరావతిలో భాగమైన ఇప్పటం గ్రామంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో అపార్టుమెంట్ నిర్మాణం చేపట్టి 10 డబుల్ బెడ్‌రూం ప్లాట్లు నిర్మించేందుకు భూమి పూజ చేయడం ముదావహమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చదరపు అడుగు రూ.3,800కు ప్రారంభ ఆఫర్ ధరకు ఇవ్వడం వినియోగదారులకు మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అమరావతి ప్రాంతవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, స్థిరాస్తి రంగ వ్యాపారులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారుల విశ్వసనీయతను చూరగొనాలని సూచించారు.
Tags amaravathi
Check Also
సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతుల సంక్షేమానికి సీఎం …